ANNUAL TEPPOTSAVAMS IN TIRUMALA FROM MARCH 3-7 _ మార్చి 3 నుండి 7వ తేదీ వరకు తిరుమల శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు

TIRUMALA, 26 FEBRUARY 2023: The annual five-day Teppotsavams in Tirumala are scheduled between March 3 to 7.

Everyday evening, Sri Malayappa in different guises will take a celestial ride over the finely decked float on the sacred waters of Swami Pushkarini between 7pm and 8pm.

On the first day Sri Sita Lakshmana Anjaneya sameta Sri Ramachandra, second day Sri Rukmini sameta Sri Krishna and on last three days, Sri Malayappa along with Sridevi and Bhudevi grace the devotees on Teppa.

TTD has cancelled arjita seva including Sahasra Deepalankara Seva on March 3 and 4, Arjita Brahotsavam and Sahasra Deepalankara Seva on March 5, 6 and 7. While Tomala and Archana will be performed in Ekantam.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 
 
 

మార్చి 3 నుండి 7వ తేదీ వరకు తిరుమల శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు

తిరుమల, 26 ఫిబ్రవరి 2023: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 3 నుండి 7వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

తెప్పోత్సవాల్లో తొలిరోజు మార్చి 3న శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. రెండవ రోజు మార్చి 4న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి అవతారంలో మూడుసార్లు విహరిస్తారు.

ఇక మూడవరోజు మార్చి 5న శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు మూడుసార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు. ఇదేవిధంగా శ్రీమలయప్పస్వామివారు నాలుగో రోజు మార్చి 6న ఐదుసార్లు, చివరి రోజు మార్చి 7వ తేదీ ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.

ఆర్జిత సేవలు రద్దు :

తెప్పోత్సవాల కారణంగా మార్చి 3, 4వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 5, 6వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు. తోమాలసేవ, అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు. మార్చి 7న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.