ANNUAL VASANTHOTSAVAMSIN SKVST _ మే 10 నుండి 12వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు 

TIRUPATI, 08 MAY 2023: The annual Vasanthotsavams in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram will be observed between May 10-12.

The procession of Swarna Ratham will be observed on May 11 between 6pm and 7pm. Every day there will be Snapana Tirumanjanam to the Utsava Murties between 2pm and 4pm.

On first two days, Sri Bhu sameta Sri Kalyana Venkateswara and on final along with these three deities, Sri Sita Lakshmana Anjaneya sameta Sri Rama and Sri Rukmink Satyabhama sameta Sri Krishna will also be rendered Snapanam.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 10 నుండి 12వ తేదీ వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు

తిరుపతి, 2023 మే 08: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు మే 10 నుండి 12వ తేదీ వరకు జరుగనున్నాయి. మే 11న సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు స్వర్ణ రథంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

ఉత్సవర్ల‌ను ఆలయంలోని వసంత మండపానికి వేంచేపు చేసి ప్రతి రోజు మ‌ధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్ సేవ, వీధి ఉత్సవం నిర్వహిస్తారు. తొలి రెండు రోజులు శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు. చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి, శ్రీ సీతాలక్ష్మణ ఆంజ‌నేయ‌స్వామి సమేత శ్రీరామచంద్రమూర్తి, శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపుగా తీసుకొచ్చి శాస్త్రోక్తంగా స్న‌ప‌న తిరుమంజ‌నం, ఆస్థానం నిర్వహిస్తారు.

వసంత రుతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామివారి దివ్యానుగ్రహం పొందడమే ఈ వసంతోత్సవం అంతరార్థం అని అర్చ‌కులు తెలిపారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.