ANOTHER DONOR’S COUNTER AT ANNAPRASADAM COMPLEX _ అన్నదానం కాంప్లెక్స్‌లో మరో దాతల కౌంటర్ ప్రారంభం
ANOTHER DONOR’S COUNTER AT ANNAPRASADM COMPLEX
Tirumala,20 April 2022: TTD Additional EO Sri AV Dharma Reddy inaugurated another Donor’s counter at Matrusri Tarigonda Vengamamba Anna Prasadam Complex on Wednesday in Tirumala.
The donors could contribute in small amounts of even ₹100 and above at the counter operated by the Union Bank of India in the Complex.
Dy EO Sri Harindranath, OSD Sri GLN Shastri, Union Bank regional manager Sri Shastri, and branch manager Sri Sambashiva Rao were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అన్నదానం కాంప్లెక్స్‌లో మరో దాతల కౌంటర్ ప్రారంభం
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో బుధవారం దాతల కోసం మరో కౌంటర్‌ను టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ చేశారు. దాతలు విరాళాలు అందించేందుకు ఇప్పటికే ఇక్కడ ఒక కౌంటర్ ఉంది.
దాతలు చిన్నమొత్తంలో అన్నప్రసాదం ట్రస్టుకు విరాళాలు సమర్పించేందుకు వీలుగా యూనియన్ బ్యాంక్ సౌజన్యంతో ఈ కౌంటర్ ఏర్పాటు చేశారు. భక్తులు రూ.100/- నుండి విరాళాలు అందించవచ్చు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ప్రత్యేకాధికారి శ్రీ జిఎల్ఎన్.శాస్త్రి, యూనియన్ బ్యాంకు రీజనల్ మేనేజర్ శ్రీ శాస్త్రి, బ్రాంచి మేనేజర్ శ్రీ సాంబశివరావు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.