AP CM FELICITATES SP HRIDAYALA DIRECTOR AND SMILE TRAIN ORGANISER _ శ్రీ పద్మావతి హృదయాలయం డైరెక్టర్, స్మైల్ ట్రైన్ సంస్థ నిర్వాహకురాలికి సిఎం సన్మానం
Tirupati, 05 May 2022: The Honourable Chief Minister of Andhra Pradesh Sri Y.S. Jaganmohan Reddy on Thursday felicitated Dr Srinath Reddy, the Director of Sri Padmavati Hridayalaya for his stellar feat of performing over 300 open heart surgeries successfully on infants at the hospital.
CM presented him with a shawl and Srivari Prasadam and also felicitated Smt Mamta Carroll, organiser of the NGO Smile Train institute which is providing free treatment at the Hospital for children with ailments like cleft Palate, deaf and dumbness with a shawl and Srivari Prasadam.
The CM lauded the contributions of both at the Bhumi puja ceremony of the Sri Padmavati Children’s super-speciality hospital.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
శ్రీ పద్మావతి హృదయాలయం డైరెక్టర్, స్మైల్ ట్రైన్ సంస్థ నిర్వాహకురాలికి సిఎం సన్మానం
తిరుపతి, 2022 మే 05: టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి హృదయాలయంలో 300 మందికి పైగా చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించిన ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డిని ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి శాలువతో సన్మానించి స్వామివారి ప్రసాదాలు అందించారు. అలాగే బర్డ్ ఆసుపత్రిలో గ్రహణ మొర్రి, చెవుడు, మూగ చికిత్సల కోసం స్వచ్చంద సేవలు అందించడానికి ముందుకు వచ్చిన స్మైల్ ట్రైన్ సంస్థ నిర్వాహకురాలు శ్రీమతి మమత కౌరల్‌ను ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి శాలువతో సన్మానించి స్వామివారి ప్రసాదాలు అందించారు. శ్రీ పద్మావతి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి భూమి పూజ సందర్భంగా గురువారం అలిపిరి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వీరిద్దరి సేవలను సిఎం ప్రశంసించారు.
అలాగే వివిధ సంస్థలకు చెందిన వైద్య నిపుణులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. అంతకుముందు ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి ముఖ్యమంత్రికి వైద్యులను పరిచయం చేశారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.