AP CM GETS LORD’S INVITE_ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించిన టిటిడి ఈవో

Tiruapti, 14 Sep 2017: TTD EO Sri Anil Kumar Singhal has invited the Honourable Chief Minister of AP Sri N Chandrababu Naidu for the nine day annual brahmotsavams of Lord Venkateswara.

The EO formally met CM of AP in later’s residence at Vijayawada on Thursday and offered him the invitation. As the Navahnika Brahmotsavams are set to commence from September 23, it is a regular practice in TTD to invite the state head for the mammoth religious event.

The Honourable CM will offer silk vastrams to Lord Venkateswara on first day of brahmotsavams on behalf of state government.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానించిన టిటిడి ఈవో

తిరుపతి, 2017 సెప్టెంబరు 14: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్‌ 23న ప్రారంభం కానుండడంతో తితిదే ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ గురువారం ఉండవల్లిలోని సీఎం నివాసంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడును కలిసి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా టిటిడి ఈవో బ్రహ్మోత్సవాల వాహనసేవలు, గరుడసేవ ఏర్పాట్లను గౌ|| ముఖ్యమంత్రికి వివరించారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవకు విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున టిటిడి అధికారులు, పోలీసులు సమన్వయం చేసుకుని ఎలాంటి రాజీకి తావు లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని తెలియజేశారు.

సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చేపట్టాలని, శ్రీవారి దర్శనంతో పాటు భక్తులందరికీ అన్నప్రసాదాలు అందేలా చూడాలని టిటిడి ఈవోకు గౌ|| ముఖ్యమంత్రి సూచించారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున రాష్ట్రముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు సెప్టెంబరు 23వ తేదీ శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.

ఈ సందర్భంగా గౌ|| ముఖ్యమంత్రివర్యులకు శ్రీవారి తీర్థప్రసాదాలను ఈవో అందించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.