JEO REVIEWS ON ENGINEERING WORKS_ బ్రహ్మోత్సవాలలో భక్తులు సంతృప్తికరంగా శ్రీవారి వాహనసేలు వీక్షించేలా ఏర్పాట్లు తిరుమల జెఈవో శ్ర కె.ఎస్‌.శ్రీనివాసరాజు

Tirumala, 14 September 2017: With less than ten days left for the annual Srivari Brahmotsavams in Tirumala, JEO Sri KS Sreenivasa Raju reviewed the ongoing engineering works with the concerned officials on Thursday.

The review meeting took place in the chambers of JEO in CRO at Tirumala. The JEO said the foot over bridge is coming up connecting Sapthagiri satralu and Asthana Mandapam at a cost Rs.65 lakhs during this annual fete. The new counters and sheds meant for Aged, physically challenged will also be completed. Similarly for the sake of the pilgrims more number of mobile toilets will be set up in the galleries of four Mada streets.

“The engineering wing is one of the most important wings of TTD and the works related to Vigilance, Health and Annaprasadam are underway and will be completed as per the schedule. The barricading, entry exit gates, special entry gates for Annaprasadam distribution into galleries will be completed in next few days. Three more RO plants are coming up at Galigopuram, MBC, Medaramitta.

Adding further he said, “The parking slots are also identified and Tirumala can accommodate 7000 four wheelers especially on Garuda Seva day. If the figure exceeds, then the four wheelers will be parked at Devaloka complex and Bharatiya Vidya Bhavan school ground in Tirupati. The APSRTC has made special bus arrangements from those places to Tirumala. The electrical works, water works are also going on a fast pace and all the engineering works will be completed by September 20 for the big fete”, he added.

SEs Sri Ramachandra Reddy, Sri Venkateswaralu, DE Smt Saraswathi, EEs Sri Prasad, Sri Venkateswara Rao and others were present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

బ్రహ్మోత్సవాలలో భక్తులు సంతృప్తికరంగా శ్రీవారి వాహనసేలు వీక్షించేలా ఏర్పాట్లు తిరుమల జెఈవో శ్ర కె.ఎస్‌.శ్రీనివాసరాజు

తిరుమల, 2017 సెప్టెంబరు 14: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులు సంతృప్తికరంగా వాహనసేవలను తిలకించేలా టిటిడిలోని అన్ని విభాగాల ఏర్పాట్లు సెప్టెంబరు 20వ తేదీ లోపు పూర్తి చేస్తున్నట్లు టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని సిఆర్‌వోలో గల జెఈవో కార్యాలయంలో గురువారం టిటిడి ఇంజినీరింగ్‌ అధికారులతో జెఈవో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుమలలో సప్తగిరి సత్రాల నుంచి ఆస్థానమండపానికి చేరడానికి వీలుగా రూ.65 లక్షలతో బ్రిడ్జి నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, బ్రహ్మోత్సవాలలోపు భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అదేవిధంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ బాధ్యతలు చేపట్టాక వయోవృద్ధులు, దివ్యాంగులకొరకు నూతన కౌంటర్లు, అదనపు షేడ్ల నిర్మాణానికి మొదటి అనుమతి ఇచ్చారని, ఈ పనులను శ్రీవారి బ్రహ్మోత్సవాలలోపు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోనికి తీసుకువస్తామన్నారు. బ్రహ్మోత్సవాలలో వాహనసేవలు వీక్షించేందుకు నాలుగుమాడ వీధులలో వేచి వుండే భక్తుల సౌకర్యార్థం తాత్కలిక ప్రతిపాదికన అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు చేసున్నట్లు తెలియజేశారు.

నూతనంగా గాలిగోపురం, ఎమ్‌బిసి, మెదరమిట్టలలో జలప్రసాదం కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే

భక్తుల సౌకర్యార్ధం టిటిడి విజిలెన్స్‌, అన్నప్రసాదం, ఆరోగ్య శాఖలవారు సమన్వయంతో ఇంజినీరింగ్‌ విభాగం అన్ని పనులను సెప్టెంబరు 20వ తేదీ లోపల పూర్తి చేయనున్నట్లు జెఈవో వివరించారు. శ్రీవారి గరుడసేవనాడు టిటిడి సూచించిన ప్రదేశాలలో వాహనాల పార్కింగ్‌కు అనుమతిస్తున్నట్లు తెలిపారు. తిరుమలలో దాదాపు 7 వేల నాలుగు చక్రాల వాహనాలను పార్కు చేసేలా సౌకర్యాలు కల్పించినట్లు, అంతకుపైబడి వచ్చే వాహనాలను అలిపిరి వద్దగల దేవలోక్‌ కాంప్లెక్స్‌, భారతీయ విద్యాభవన్‌ పాఠశాల ప్రాంగణంలో పార్కు చేసేలా చర్యలు తీసుకుంటునట్లు తెలిపారు.

ఈ సమావేశంలో ఎస్‌ఈ 2 శ్రీ రామచంద్రారెడ్డి, ఈఈలు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ తోట వెంకటేశ్వర్లు, శ్రీమతి సరస్వతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.