AP CM OFFERS PRAYERS IN TIRUMALA TEMPLE _ శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి
OFFERS TULABHARAM
TIRUMALA, 12 OCTOBER 2021: The Honourable CM of Andhra Pradesh, Sri YS Jagan Mohan Reddy had darshan of Sri Venkateswara Swamy at Tirumala on Tuesday morning.
Accompanied by TTD Chairman Sri YV Subba Reddy, he was welcomed by TTD EO Dr KS Jawahar Reddy and Additional EO Sri AV Dharma Reddy at Mahadwaram.
After Darshan, he offered rice in Tulabharam to the tune of 78 kilos equal to his weight.
MPs Sri Gurumurty, Sri Mithun Reddy, Sri Prabhakar Reddy, Ministers Sri V Srinivasa Rao, Sri P Ramachandra Reddy, Sri Venugopala Krishna and many others present.
Among others DIG Sri Krantirana Tata, Collector Sri Harinarayana, CVSO Sri Gopinath Jatti, Tirupati Urban SP Sri Venkatappala Naidu and other district administration officers were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి
తులాభారం మొక్కు తీర్చుకున్న ముఖ్యమంత్రి
తిరుమల, 2021 అక్టోబరు 12: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం దర్శించుకున్నారు.
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
స్వామివారి దర్శనానంతరం శ్రీ వకుళామాతను, ఆలయ ప్రదక్ష్షిణగా వచ్చి శ్రీ విమాన వేంకటేశ్వరస్వామి, సబేరా, భాష్యకార్ల సన్నిధి, శ్రీ యోగనరసింహస్వామివారిని దర్శించుకున్నారు.
తులాభారం మొక్కు తీర్చుకున్న ముఖ్యమంత్రి :
శ్రీవారి దర్శనానంతరం ముఖ్యమంత్రి గౌ|| శ్రీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆలయంలోని తులాభారం మొక్కు తీర్చుకున్నారు. శ్రీవారి అనుగ్రహంతో కోరికలు తీరిన భక్తులు తమ బరువుకు సమానంగా బెల్లం లేదా బియ్యం లేదా ఇతర ధాన్యాలతో తూకం వేసి స్వామివారికి సమర్పించడం ఆనాదిగా వస్తున్న సంప్రదాయం.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తన బరువుకు సమానంగా 78 కిలోల బియ్యం తులాభారంలో సమర్పించి మొక్కు చెల్లించారు.
ఎంపీలు శ్రీ మిథున్ రెడ్డి, శ్రీ ప్రభాకర్ రెడ్డి, శ్రీ గురుమూర్తి, మంత్రులు శ్రీ పి. రామచంద్రారెడ్డి, శ్రీ వేణుగోపాల కృష్ణ, శ్రీ వి.శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు శ్రీ కరుణాకర్ రెడ్డి, శ్రీ మధుసూదన్ రెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీ శ్రీకాంత్ రెడ్డి, బోర్డు సభ్యులు శ్రీమతి ప్రశాంతి రెడ్డి, శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి, శ్రీ విశ్వనాధరెడ్డి, శ్రీ మధుసూదన్ యాదవ్, శ్రీ పోకల అశోక్ కుమార్, డిఐజి శ్రీ క్రాంతిరాణా టాటా, జిల్లా కలెక్టర్ శ్రీ హరినారాయణన్, టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.