AP CM TAKES PART IN KAMADHENU GOPUJA HELD AT NARASARAO PET _ సి ఎం చేతుల మీదుగా కామధేను పూజ – సాంప్రదాయ బద్దంగా పూజ చేసిన సిఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి

POMP AND GAIETY MARKS THE GOPUJA ON KANUMA DAY

 NARASARAOPETA, 15 JANUARY 2021: On the auspicious occasion of Kanuma festival, Kamadhenu Gopuja was performed by TTD at Narasaraopeta in Guntur district which was graced by Honourable of Andhra Pradesh Sri YS Jaganmohan Reddy.

The traditional fete took place amidst pomp and gaiety with people turning in large numbers to cherish the unique Go puja Mahotsavam held at the spacious Sports Authority Stadium Grounds here on Friday.

The entire grounds is decked with traditional look with pandals, colourful rangolis, flower decorations and with a separate yard housing many cows.

The CM of AP took part in the Kamadhenu Go puja. The Vedic pundits recited Swasti Mantras, Sakala Devata Swaroopa Kamadhenu Stotram, Nandikesa Stotram and later did Sankalpam followed by Sodashopachara Go puja.

After performing Puja to both the cow and calf, CM offered new vastrams and Harati to the holy bovine. Later he wished the people who gathered to witness the Kamadhneu Gopuja, the festival Greetings and aspired that the fruits of the festival would bring good fortunes to every one.

It may be mentioned here that as part of Hindu Sanatana Dharma, TTD has taken up a unique programme called Gudiko Gomata recently by presenting a cow and calf to every temple as a part of the mission.

According to Hindu Sanatana Dharma, Cow has got a prominent place and being revered as an embodiment of 33 crore deities. Cow has the potential to absorb and emanate the Principles of all these deities. To protect and promote the cows, this year, the Kanuma Go puja was observed in a big way across the state in all the temples on the festival day.

The prominent among those who took part in Kamadhenu Go puja at Narasaraopeta included Dy Speaker Sri Kona Raghupathi, Home Minister Smt Sucharita, Endowments Minister Sri Vellampalli Srinivas, Local MLA Sri Srinivasa Reddy, district authorities and others.

TTD Chairman Sri YV Subba Reddy, EO Dr KS Jawahar Reddy, JEO Sri Basant Kumar, CE Sri Ramesh Reddy, Goshala Director Dr Harnath Reddy, Additional CVSO Sri Sivakumar Reddy and other officers from TTD were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

సి ఎం చేతుల మీదుగా కామధేను పూజ
– సాంప్రదాయ బద్దంగా పూజ చేసిన సిఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి

తిరుమల 15 జనవరి 2021: కనుమ పండుగ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు గుంటూరు జిల్లా నరసరావుపేట లో శుక్రవారం నిర్వహించిన కామధేను పూజ (గోపూజ) లో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

పంచకట్టు, కండువతో కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి ఆ ప్రాంగణంలోని గోమాతలు, నందీశ్వరులు( ఎద్దు) అలంకరణలు చూశారు. అనంతరం గో పూజకు గోత్ర నామాలతో ఆయన సంకల్పం చేసుకున్నారు. వేద పండితులు, అర్చకుల వేద మంత్రాల నడుమ శ్రీ జగన్మోహన్ రెడ్డి గోమాతకు, దూడకు పట్టు వస్త్రాలు, పూలమాలలు, పసుపు కుంకుమ సమర్పించి హారతి ఇచ్చారు. గోమాత, దూడ కు ఆయన ప్రదక్షిణ చేసి నమస్కరించారు. టీటీడీ అర్చకులు సి ఎం ను శేష వస్త్రం తో సత్కరించారు. ఇస్కాన్ ప్రతినిధులు శాలువతో సత్కరించి జ్ఞాపిక ను అందించారు. స్థానిక శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ముఖ్యమంత్రిని గజమాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానాలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. గోపూజ వల్ల రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు ఆయన సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

కామధేను పూజ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, రాష్ట్ర మంత్రులు శ్రీమతి మెకతోటి సుచరిత,శ్రీ వెల్లం పల్లి శ్రీనివాస రావు, డిప్యూటి స్పీకర్ శ్రీ కోన రఘుపతి, ఎంపీ శ్రీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు, టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, జెఈవో శ్రీ పి బసంత్ కుమార్, కలెక్టర్ శ్రీ శ్యా మ్యూల్ ఆనంద్, ఎస్పీ శ్రీ విశాల్ గున్ని, గుంటూరు జిల్లాకు చెందిన పలువురు శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా గోపూజ

హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో గోపూజ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర దేవాదాయ శాఖ సహకారంతో టీటీడీ ఆర్థిక సహకారంతో రాష్ట్రంలోని 2679 ఆలయాల్లో ఉదయం 11.50 గంటలకు శాస్త్రోక్తంగా గోపూజ కార్యక్రమమాలు నిర్వహించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది