AP CM TERMS ORNAMENTS DONATION AS FIRST OF ITS KIND IN THE HISTORY OF TTD _ శ్రీవారికి రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు, వజ్రాభరణాల సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
LAUDS THE PHILANTHROPIC COUPLE FOR THEIR LARGESSE
WEALTH AND FAME ARE TEMPORARY; SPIRITUALITY AND RIGHTEOUSNESS ARE ETERNAL
COMPLIMENTS TTD FOR MAINTAINING SANCTITY, SERENITY, CLEANLINESS IN TIRUMALA
LAYS FOCUS ON A NINE POINT DEVELOPMENT PROGRAMME FOR TIRUMALA
TIRUMALA, 26 NOVEMBER 2026: Terming the donation of 121kg gold Rs.206cr worth ornaments by Chennai-based donor couple as the first of its kind in the history of Tirumala Tirupati Devasthanams (TTD), the Honourable CM of AP Sri N Chandra Babu Naidu complimented them for their humongous donation.
Addressing media persons at Sudharma Conference Hall in Sri Padmavathi Rest House in Tirumala on Thursday, along with the donor couple, Sri Vardhman Jain and Smt Radhika Jain, the Honourable CM of AP reiterated that the Donor couple has set an example to others with this largesse. “Since my childhood days, I have been an ardent devotee of Sri Venkateswara Swamy and for the first time I had seen such a massive donation and feel it as a privilege to be a part in this divine donation programme. In 2024, the largest donation recorded was 101kg Gold for Ayodhya temple and today TTD coffers added 121kg gold”, he expressed.
Adding further he said, Wealth and Fame are temporary while Spirituality and Righteousness are eternal. “There may be umpteen numbers of millionaires but only a few along reaches the pinnacle of the purpose of their lives with charitable activities. “The Jain couple have proved “Manava Sevaye Madhava Seva” in right spirit setting example to others”, he asserted.
Citing a few examples from the History of Tirumala temple, the CM said, in the past Pallavas, Cheras, Cholas, Pandyas, Vijayanagara rulers, Mysore Kings, Marathas and even Britishers also contributed a lot towards the development of Tirumala temple by donating large scale jewels, lands etc. After that, today we all witnessed the historical donation. From the era of Sri Krishnadevaraya back then to the Jain couple today, devotion and faith towards Sri Venkateswara Swamy have continued, he observed.
Later he complimented TTD mandarins for maintaining Sanctity, Serenity, and Cleanliness across Tirumala and providing all sorts of amenities to the tens of thousands of devotees. Utilizing latest technology the darshan numbers have been increased and waiting hours have also been reduced to the devotees who pave visit to the hill shrine every day.
However, he has asked the TTD authorities to focus on a 09-point development programme to take the glory of the institution to newer heights further.
• Gosamrakshana
• Veda Parirakshana
• Spreading the services of Srivari Sevaks
• Construction of Srivari Temples in India and overseas also
• Extending Annaprasadam to all temples
• Enhancing Pranadana activities
• Improving Skill Development under Vidyadana Trust
• Increasing bio-diversity through “Vriksha Govindam”
• Overcoming water scarcity
Sharing his views, the Donor Sri Vardhman Jain said, he thanked Sri Venkateswara Swamy for giving him a divine opportunity to his family for sanctifying their lives and said, of the 121kg gold, 106 kg were utilized to prepare gold ornaments to Srivaru, while the remaining 15kg gold will be used to prepare a Vastram and donate it to Sri Padmavathi Devi of Tiruchanoor, likely in the next three months.
TTD Specified Authority Chairman and EO Sri M Ravichandra, Additional EO Sri Ch Venkaiah Chowdary, JEOs Dr Sharath, Sri Gopinadh, CVSO Sri Muralikrishna, SVBC Chairman Sri Sridhar Verma, SVIMS and BIRRD Director Dr Jagdeesh and others were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
సేవలోనే నిజమైన ఆనందం
పేదల సంక్షేమం, ఆధ్యాత్మిక సేవకు ధనవంతులు ముందుకు రావాలి
శ్రీకృష్ణదేవరాయలు నుంచి జైన్ దంపతుల వరకు భక్తి పరంపర కొనసాగుతోంది
–చెన్నైకు చెందిన జైన్ దంపతులతో కలిసి తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి
శ్రీవారికి రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు, వజ్రాభరణాల సమర్పణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
అపూర్వ దాతృత్వం చాటిన వర్ధమాన్ జైన్ దంపతులపై సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు
తిరుమల, 2026, నవంబరు 26: డబ్బు, సంపద, హోదా ఎప్పటికీ శాశ్వతం కాదు.. ఆధ్యాత్మికత, ధర్మం, సేవా భావమే మనిషికి అసలైన సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచంలో ఎంతోమంది బిలియనీర్లు, ట్రిలియనీర్లు ఉన్నారని… కానీ సంపాదించిన సంపదను సద్వినియోగం చేసుకునే అదృష్టం కొందరికే దక్కుతుందన్నారు. ఆ కోవలోనే నిలిచి తమ దాతృత్వాన్ని చాటుకున్న చెన్నైకు చెందిన వర్ధమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు అందరికీ ఆదర్శంగా ఉన్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. గురువారం తిరుమల శ్రీవారికి చెన్నైకు చెందిన జైన్ దంపతులు రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు, వజ్రాభరణాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సతీసమేతంగా పాల్గొన్నారు. టీటీడీ అర్చకులు, అధికారులు ఈ ఆభరణాలను స్వీకరించారు. అనంతరం ధాతలైన జైన్ దంపతులతో కలిసి సీఎం తిరుమలలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… తిరుమల పవిత్ర క్షేత్రంలో ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైందని, ఇందులో తాను భాగస్వామి కావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రతిరోజూ శ్రీవారికి 120 కిలోల బంగారు ఆభరణాలు అలంకరిస్తారని, దేవుని ఆదేశంతోనే 121 కిలోల బంగారు, వజ్రాభరణాలను సమర్పించామని జైన్ దంపతులు చెప్పడం వారి భక్తికి నిదర్శనమన్నారు. పూర్వం పల్లవ, చోళ, చేర, పాండ్య రాజులతో పాటు మైసూర్, మరాఠా రాజులు ఆలయాన్ని అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారికి రత్నకిరీటం, పీతాంబరం సహా ఎన్నో ఆభరణాలు సమర్పించారని, ఆనాటి శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి నేటి జైన్ దంపతుల వరకు స్వామివారిపై భక్తి విశ్వాసాలు పెరుగుతూనే ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు.
మానవ సేవే… మాధవ సేవ
దేవునిపై భక్తి ఉన్న ప్రతి ఒక్కరూ మానవ సేవే – మాధవ సేవ అనే సూత్రాన్ని గుర్తుంచుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. సమాజ హితం కోసం పనిచేసే వారే దేవునికి అత్యంత సన్నిహితంగా ఉంటారన్నారు. జైన్ దంపతుల తరహాలోనే ఇతర సంపన్నులు కూడా ముందుకు వచ్చి పేదల సంక్షేమం, సమాజ సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. భక్తులు సమర్పించే ప్రతి రూపాయిని టీటీడీ వారి సౌకర్యాలు, సేవలకే ఖర్చు చేస్తోందన్నారు. రాష్ట్రంలో టీటీడీ సహకారంతో 5 వేల దేవాలయాల నిర్మాణం చేపట్టబోతున్నామని, దేశంలోని అన్ని రాజధానులతో పాటు విదేశాల్లో హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని వెల్లడించారు. ఆలయం ఉన్న ప్రతిచోటా అన్నప్రసాదం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, ‘ప్రాణదానం’ ద్వారా వైద్య సేవలు, ‘విద్యాదానం’ కింద ప్రత్యేక నిధితో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామని తెలిపారు. ఎల్ నినో వంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ‘వృక్షో గోవిందం’ పేరుతో పచ్చదనం పెంపు కార్యక్రమాలు చేపడతామన్నారు. భవిష్యత్తులో తిరుమలకు నీటి ఎద్దడి అనే మాటే లేకుండా హంద్రీ-నీవా ద్వారా కళ్యాణి డ్యాంకు, సోమశిల ద్వారా బాలాజీ రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తామని, అవసరమైతే తిరుమలకు రెండో పైప్ లైన్ కూడా వేస్తామని స్పష్టం చేశారు. టెక్నాలజీ, నాలెడ్జ్‌తో పాటు భగవంతుని కృప ఉండటం వల్లే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్రం, దేశం మరింత అభివృద్ధి చెందడం ఖాయమని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
నమ్ముకున్న వారికి శ్రీవారి అండ… రక్షణ
పూర్వ కాలంలో దేవాలయాల మీద చాలా దాడులు జరిగాయి… కానీ వెంకటేశ్వరస్వామి దేవాలయం విషయంలో ఎవ్వరూ ఆ సాహసానికి ఒడిగట్టలేదని ముఖ్యమంత్రి అన్నారు. రోజు రోజుకూ శ్రీవారి భక్తుల విశ్వాసాన్ని పెంపోందించడానికి చాలా మంది కృషి చేశారని చెప్పారు. కొలిచిన వారికి, నమ్మిన వారికి శ్రీవారు రక్షణగా నిలిచారని… అది తన విషయంలో నిరూపితమైందన్నారు. ప్రాణదానం కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజే నాపై అలిపిరిలో దాడి జరిగిందని… చాలా పకడ్బందీగా నాపై దాడి జరిగినా… స్వామి కృప వల్లే ఆ దాడిలో ఎవ్వరూ చనిపోలేదని చెప్పారు. వెంకటేశ్వర స్వామే ప్రాణభిక్ష పెట్టారని… పునర్జన్మనిచ్చారంటూ సీఎం భావోద్వేగంతో నాటి సంఘటనను గుర్తుచేసుకున్నారు. ప్రపంచం మొత్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో విశ్వాసం పెంపోందించేలా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. భక్తుల విరాళాలు, ఆదాయాన్ని వెల్లడించడం, భక్తులు ఇచ్చిన విరాళాలను వారి సౌకర్యాలు.. సేవలకే ఖర్చు పెడుతున్నారని తెలిపారు. తిరుమల కొండపై పచ్చదనం విరాజిల్లుతోందని… దేవుని పవిత్రత కాపాడే విషయంలో రాజీ పడవద్దని టీటీడీకి విజ్ఞప్తి చేశారు. గో-సంరక్షణ, వేద పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని… దీనికి టీటీడీ నాందీ పలకాలన్నారు. శ్రీవారి దేవాలయాన్ని ఆదర్శంగా… పవిత్రతకు మారుపేరుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. శ్రీవారి సేవకులు చాలా భక్తి విశ్వాసంతో సేవలు అందిస్తున్నారని… వారిని మరింత ప్రొత్సహించాలన్నారు. ఎక్కడికక్కడ శ్రీవారి దేవాలయాలను నిర్మించాలి… ఆ దేవాలయాల్లో ప్రశాంత, పవిత్ర వాతావరణం ఉండేలా చూడాలని నిర్దేశించారు. దేశంలోని అన్ని రాజధానుల్లో శ్రీవారి దేవాలయాలను నిర్మిస్తామని… విదేశాల్లో కూడా హిందువులు ఎక్కువగా ఉన్న చోట వెంకటేశ్వర స్వామి దేవాలయాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ సమావేశంలో దాతలు వర్ధమాన్ జైన్ దంపతులు ,టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ మరియు టీటీడీ ఈఓ శ్రీ ముద్దాడ రవి చంద్ర , అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డా. ఎస్ వేంకటేశ్వర్, జేఈవోలు డా.ఎ.శరత్, శ్రీ ప్రభల గోపీనాథ్, సివిఎస్వో శ్రీ కేవీ మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు తదితర పాల్గొన్నారు
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది




