PRECIOUS JEWELS PRESENTED TO “SRI VENKATESWARA” IN THE PRESENCE OF AP CM _ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆభరణాల సమర్పణ

207.6CR WORTH 121 KG GOLD  JEWELS DONATED 

TIRUMALA, 26 NOVEMBER 2026: A Chennai based philanthropic couple, Sri Vardhman Jain and Smt Radhika Jain, in what is considered to be a historical donation in the history of Tirumala Tirupati Devasthanams (TTD), has donated Rs.207cr worth 121kg gold jewels to the Lord of Seven Hills, Sri Venkateswara Swamy on Thursday at Tirumala temple, in the presence of the Honourable CM of AP Sri N Chandra Babu Naidu.

After Darshan of the presiding deity, the CM along with the donor couple and other family members, had viewed the 46 pieces of Golden ornaments displayed at the Ranganayakula Mandapam and appreciated them for their largesse.

Later, each member from the family of donors carried the ornaments on a plate over their head, circumambulating the Dhwajastambham and reached the sanctum sanctorum, placing the jewels in front of the swami vaaru and offered prayers.

TTD Specified Authority Chairman and EO Sri M Ravichandra, Additional EO Sri Ch Venkaiah Chowdary, JEOs Dr Sharath, Sri Gopinadh, CVSO Sri Muralikrishna were present. While among district authorities Collector Dr Venkateswar, SP Sri Subbarayudu and other officials were also present. 

DETAILS ABOUT ORNAMENTS:

Total Gold-121 Kg (24 ct) to prepare 46 numbers of 33 types of ornaments for Tirumala temple 

Total Value of 121 Kg including making charges stands at Rs. 207.6 Cr

Gold used for  the ornaments for Tirumala temple-106 Kg (24 ct)

Balance Gold-15 Kg (24 ct) will be utilized for preparing Sri Padmavathi  Ammavari Vasthram at Tiruchanoor temple

Other details in the ornaments donation:

Total Weight of Diamonds – 238.2 ct

Precious Stones-2,247.7 ct

Blue Sapphires-91.6 ct

Yellow Sapphires-84.2 ct

Rubies & Emeralds-2,916.5 gms

Saligramam stones

LIST OF JEWELS:

Pada Kavachams-02

Andelu(anklets)-02

Pogada -01

Tulasi-Patra Pushpamu– 01

Ashtottara Shatanama Kasula Haram – 01

Chaturbhuja Lakshmi Haram – 01

Puligoru(Tiger-claw pendant) – 01

Ashtottara Patra Haram (leaf necklace) – 01

Nara necklaces – 01

Gantala Molatadu (waist belt) – 01

Suvarna Kanthi (Gold neck ornament) – 01

Kanaka Pushpamu (Golden flower) – 01

Vaishnavam – 01

Molacheyi – 01

Kati Sutram (Silver-foil) – 01

Nagabharana Vaddanam (Serpent-motif waist belt) – 01

Chain – 01

Abhayahastala Kankanalu (Hand Bracelets) – 05

Chandanavanka Kanthi (choker) – 01

Vaikuntha Hastamu (Hand ornament) – 01

Kathi Hastamu (Hand ornament) – 01

Nagabharana Kadiyamulu (Serpent-motif anklets) – 02

Nagabharanams (Serpent ornaments) – 02

Bhujakeerthulu (Armlets/shoulder ornaments) – 02

Karna Patramulu (Ear Hangings) – 02

Bahuvulu (Armlets) – 02

Shaligrama Haram (Necklace) – 2 (2 parts)

Kamalala Tribhuja Saligrama Harams (Lotus-and-triangle Shaligrama necklaces – 2 (2 parts)

Seema Kavachamulu – 01

Sankha Kavacham (Conch cover) – 01

Chakra Kavacham (Disc cover) – 01

Mutha Pusa (Pearl bead/string) – 01

Crown – 01

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

శ్రీవారికి రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాల విరాళం

46 ఆభరణాలను సమర్పించిన చెన్నైకి చెందిన వర్థమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆభరణాల సమర్పణ

తిరుమల, 2026 నవంబర్ 26: తిరుమల శ్రీవారి చరిత్రలో చారిత్రాత్మక విరాళంగా నిలిచేలా చెన్నైకి చెందిన దాతలు శ్రీ వర్థమాన్ జైన్, శ్రీమతి రాధికా జైన్ దంపతులు రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను గురువారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ విరాళం సమర్పించారు.

శ్రీవారి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, దాత దంపతులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి రంగనాయకుల మండపంలో ప్రదర్శించిన 46 బంగారు ఆభరణాలను వీక్షించి, దాతల ఉదారతను అభినందించారు.

అనంతరం దాత కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు తలపై ఆభరణాల పళ్లెంలను ధరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, శ్రీవారి సన్నిధికి చేరుకుని ఆభరణాలను స్వామివారి ఎదుట సమర్పించి పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ సాధికార మండలి చైర్మన్, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈవోలు డా. శరత్, శ్రీ గోపీనాథ్, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ పాల్గొన్నారు. జిల్లా అధికారుల్లో కలెక్టర్ డా. వెంకటేశ్వర్, ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఆభరణాల వివరాలు

•  మొత్తం బంగారం: 121 కిలోలు (24 క్యారెట్లు)

•  మొత్తం ఆభరణాలు: 46

•  ఆభరణాల రకాలు: 33

•  ఆభరణాల తయారీ ఖర్చులతో కలిపి మొత్తం విలువ: రూ.206 కోట్లు

•  శ్రీవారి ఆభరణాలకు వినియోగించిన బంగారం: 106 కిలోలు (24 క్యారెట్లు)

•  మిగిలిన 15 కిలోల బంగారంతో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి స్వర్ణ వస్త్రం తయారు చేయనున్నారు.

విలువైన రాళ్ల వివరాలు

•  వజ్రాల మొత్తం బరువు: 238.2 క్యారెట్లు

•  నీలమణులు: 2,247.7 క్యారెట్లు

•  పసుపు నీలమణులు: 91.6 క్యారెట్లు

•  కెంపులు, పచ్చలు 84.2 క్యారెట్లు

•  సాలగ్రామ రాళ్లు : 2,916.5 గ్రాములు.

విరాళంగా సమర్పించిన 33 రకాల ఆభరణాల వివరాలు

 1. పాద కవచములు – 2

 2. అందెలు – 2

 3. పాగడ – 1

 4. తులసిపత్ర హారము – 1

 5. అష్టోత్తర శత కాసుల మాల – 1

 6. చతుర్భుజ లక్ష్మీ హారము – 1

 7. పులిగోరు – 1

 8. అష్టోత్తర పత్ర హారము – 1

 9. సాదా వడ్డాణము – 1

10. గంటల ములత్రాడు – 1

11. సూర్య కంఠి – 1

12. కౌస్తుభం – 1

13. శ్రీవత్సం – 1

14. మొలచేయి – 1

15. కటి హస్తము పై రేకు – 1

16. నాగాభరణ వడ్డాణము – 1

17. గొలుసు – 1

18. అభయ చేతుల కంకణాలు – 5

19. చంద్ర వంక కంఠి – 1

20. వైకుంఠ హస్తము – 1

21. కరి హస్తము – 1

22. నాగాభరణ కడియములు – 2

23. నాగాభరణములు – 2

24. భుజకీర్తులు – 2

25. కర్ణ పత్రములు – 2

26. బాహువులు – 2

27. శాలిగ్రామ హారము – 2 (2 భాగాలు)

28. కమలం త్రపు శాలిగ్రామ హారములు – 2 (2 భాగాలు)

29. నీమ కవచముల మోపుగల యజ్ఞోపవీతం – 1

30. శంఖము కవచము – 1

31. చక్రము కవచము – 1

32. ముక్కుపుడి – 1

33. కిరీటము – 1

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.