AP CM TO INAUGURATE SRINIVASA SETHU ON SEPTEMBER 18 _ సెప్టెంబ‌రు 15వతేదీకిశ్రీనివాససేతునిర్మాణపనులుపూర్తిచేయాలి – టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి

Tirupati, 06 September 2023: TTD EO Sri AV Dharma Reddy on Wednesday said that the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy will inaugurate the prestigious Srinivasa Sethu flyover providing swift and smooth transport to pilgrims and locals in Tirupati to Alipiri on September 18.

Speaking after reviewing the last phase of pending works on Srinivasa Sethu with TTD and TMC officials at his chambers in the TTD administrative building, the EO directed officials concerned to ensure the completion of works like cross barriers, modernization of road, central dividers, footpaths, painting, BT topping, etc by September 15. He requested the TMC commissioner Smt Haritha to commence trial runs from September 12 itself.

TTD JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, FA&CAO Sri Balaji, CE Sri Nageswar Rao, SE(TMC) Sri Mohan, EE Sri Chandrasekhar, AFCONS Project Director Sri Murugesan were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

– సెప్టెంబ‌రు 15వ తేదీకి శ్రీనివాస సేతు నిర్మాణ పనులు పూర్తి చేయాలి.

– టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి

 తిరుపతి, 2023 సెప్టెంబ‌రు 06 [ శ్రీనివాస సేతును సెప్టెంబ‌రు 18వ తేదీన‌ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వ‌ర్యులు శ్రీ వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి గారిచే ప్రారంభించేందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయాల‌ని టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. బుధవారం టీటీడీ పరిపాల భవనంలోని తన ఛాంబర్ లో టీటీడీ, మున్సిపల్ అధికారులతో శ్రీనివాస సేతు నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, శ్రీనివాస సేతు నిర్మాణ పనులు సెప్టెంబ‌రు 15వ తేదీకి పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న సెంట్రల్ డివైడర్లు, కాలువలు, ఫుట్‌పాత్‌లు, వీధుల ఆధునీకరణ, పెయింటింగ్, క్రాష్ బ్యారియ‌ర్లు, బి.టి.రోడ్డు, సుందరీకరణ త‌దిత‌ర ప‌నుల‌ను సెప్టెంబ‌రు 15 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమీషనర్ శ్రీమతి హరితను కోరారు. సెప్టెంబ‌రు 12వ తేదీ నుండి శ్రీనివాస సేతుపై ట్రైయ‌ల్ ర‌న్ నిర్వ‌హించాల‌న్నారు.

ఈ సమావేశంలో జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, మున్సిపల్ కమీషనర్ శ్రీమతి హరిత ,ఎఫ్ ఏ అండ్ సిఏఓ శ్రీ బాలాజీ, సిఈ శ్రీ నాగేశ్వరరావు, మున్సిపల్ ఎస్ఇ శ్రీ మోహన్, ఈఈ శ్రీ చంద్ర శేఖర్, ఆఫ్కాన్స్ ప్రాజెక్టు డైరెక్ట‌ర్ శ్రీ మురుగేష‌న్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.