AP CM UNVEILS 2021 TTD DIARIES AND CALENDARS _ 2021 టిటిడి డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

Tirumala, 23 Sep. 20: On the fifth day of ongoing Srivari Annual Brahmotsavams at Tirumala, the Honourable Chief Minister of Andhra Pradesh Sri Y S Jaganmohan Reddy unveiled the 2021 TTD Calendars and Diaries on Wednesday night at Ranganayakula  Mandapam in the Srivari temple. 

The Calendars and Diaries included 12-sheet calendars (15 lakhs), Big Diaries(8 lakhs), Small Diaries (2 lakhs), Srivari Table top calendars(75,000), Big Single Srivari (3.5 lakhs), Big Single Sri Padmavati Ammavari calendars (10,000), Sri Padmavati and Srivari calendars (4 lakhs),Telugu Panchangam calendars (2.50 lakhs).

All these will be available to public from September 28 onwards at Tirumala and Tirupati in all the TTD bookstalls. From October second week onwards they will be available at all TTD information centres  in other regions also.

AP Deputy CM Sri Narayanaswamy,Minister Sri Peddireddy Ramachandra Reddy,TTD Trust Board Chairman Sri Y V Subba Reddy, TTD EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy, JEO Sri P Basanth Kumar, Tirupati MLA Sri Bhumana Karunakaran Reddy,Chandragiri MLA Dr Chevireddy Bhaskar Reddy, several  members of TTD trust board, special invitees, CVSO  Sri Gopinath Jatti,Tirupati Urban SP Sri Ramesh Reddy were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

2020 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

2021 టిటిడి డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

సెప్టెంబర్ 23, తిరుమ‌ల 2020: శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన బుధ‌వారం రాత్రి స్వామివారి దర్శనానంతరం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి టిటిడి ముద్రించిన 2021వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆలయంలో ఆవిష్కరించారు.

12 పేజీల క్యాలెండర్లు 15 లక్షలు, పెద్ద డైరీలు 8 లక్షలు, చిన్నడైరీలు 2 లక్షలు, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు 75 వేలు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, శ్రీవారు, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 4 లక్షలు, తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను టిటిడి ముద్రించింది. ఇవి సెప్టెంబ‌రు 28వ తేదీ నుండి తిరుమల, తిరుపతిలోని టిటిడి పుస్తక విక్రయశాలల్లో అందుబాటులో ఉంటాయి. అక్టోబ‌రు రెండో వారం నుండి ఇత‌ర ప్రాంతాల్లోని టిటిడి స‌మాచార కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.