AP CS OFFERS PRAYERS _ శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

Tirumala 19 January 2024:The Chief Secretary of Andhra Pradesh, Dr. KS Jawahar Reddy participated in the Abhisheka seva of Sri Venkateswara Swamy at Tirumala on Friday and also offered prayers in Tiruchanoor temple.

After the darshan of Srivaru, the Vedic scholars offered Vedaseervachanam in Ranganayakula Mandapam. 

The Additional EO(FAC) Sri Veerabrahmam presented Theertha Prasadams to the dignitary.

Deputy EO Sri Harindranath, VGO Sri Giridhar Rao, Reception OSD Sri Ramakrishna, and others participated in this program.

DARSHAN OF SRI PADMAVATI AMMAVARU IN TIRUCHANUR

After the darshan of Tirumala Srivaru, the CS offered prayers to Sri Padmavati Devi in Tiruchanoor followed by Vedaseervachanam and the presentation of Seshavastram.

Temple Deputy EO Sri Govindarajan, VGO Sri Bali Reddy, Superintendent Smt Srivani, and others participated in this program.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

 తిరుమల, 2024 జ‌న‌వ‌రి 19 ; రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు శుక్ర‌వారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి అభిషేక‌ సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం అందించారు. అనంత‌రం శ్రీ‌వారి తీర్థ‌ప్ర‌సాదాలు, డైరీ, క్యాలెండ‌ర్‌ను జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం అంద‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, విజివో శ్రీ గిరిధ‌ర్‌రావు, రిసెప్ష‌న్ ఓఎస్‌డి శ్రీ రామ‌కృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ద‌ర్శ‌నం

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానంత‌రం తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు దర్శించుకున్నారు. ద‌ర్శ‌నానంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శేషవస్త్రం, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ గోవింద‌రాజ‌న్‌, విజివో శ్రీ బాలిరెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీమ‌తి శ్రీ‌వాణి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.