AP GOVERNOR OFFERS PRAYERS IN TIRUMALA SHRINE _ శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్
శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర గవర్నర్
తిరుమల, 2012 జూలై 04: గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ కుటుంబ సమేతంగా బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో దర్శించుకున్నారు. అంతకుపూర్వం ఆయన క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా స్వామివారి పుష్కరిణికి అంజలి ఘటించి భూవరాహస్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం శ్రీవారి ఆలయం చెంత ఆలయాధికారులు మరియు అర్చకులు ఇస్తికపాల్ స్వాగతం పలికారు. గవర్నర్ శ్రీవారి మూలవిరాట్టును, వకుళామాతను, విమాన వేంకటేశ్వరస్వామిని, భాష్యకార్ల వారిని, యోగనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం పలికారు. ఆ తరువాత ఈఓ శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం, జెఈఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్, విడిది విభాగం డెప్యూటీ ఈఓ శ్రీమతి వరలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.