AP HIGH COURT CJ OFFERS PRAYERS _ శ్రీవారి సేవలో రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్

TIRUMALA, 12 AUGUST 2023: The Honourable CJ of AP High Court Justice Dhiraj Singh offered prayers in Tirumala temple along with his family on Saturday.

During his maiden visit to the Hill temple, he was rendered Istikaphal welcome by priests and accompanied for darshan by TTD EO Sri AV Dharma Reddy. After offering prayers, he was rendered Vedasirvachanam inside Ranganayakula Mandapam.

Later the TTD EO presented Theertha Prasadams, a laminated photo of Srivaru, Namami Govindam kit, Agarbattis kit, Dry Flower Technology photo of deity to the protocol dignitary.

The CJ has also visited the Ayina Mahal where the Dolotsavam of Sri Malayappa Swamy takes place. The EO explained to him about the historical significance of the Addala Mandapam. Later the CJ and his entourage were offered Srivari Prasadams.

Afterwards, the CJ also paid a visit to Sri Anjanadevi-Sri Balanjaneya Swamy temple located in Anjanadri Akasaganga along with TTD EO.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి సేవలో రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్

తిరుమల, 2023 ఆగస్టు 12: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ శనివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ కు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ఆయనకు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు.

స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్ కు పండితులు వేద ఆశీర్వాదం చేశారు.

అనంత‌రం ఈవో శ్రీ ధీరజ్ సింగ్ ఠాకూర్ కు స్వామివారి తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్ర పటం, నమామి గోవిందం కిట్‌, అగరుబత్తీలు, డ్రై ఫ్లవర్‌ టెక్నాలజీతో తయారుచేసిన దేవతా మూర్తి ఫొటోలను అందజేశారు.

శ్రీ మలయప్ప స్వామి డోలోత్సవం జరిగే ఐనా మహల్‌ను కూడా సీజే సందర్శించారు. అద్ధాల మండపం చారిత్రక విశిష్టత గురించి ఈవో ఆయనకు వివరించారు.

అనంతరం అంజనాద్రి ఆకాశగంగలో వెలసిన శ్రీ అంజనాదేవి-శ్రీబాలాంజనేయ స్వామి ఆలయాన్ని టీటీడీ ఈవోతో కలిసి సీజే సందర్శించారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.