PAVITROTSAVAMS IN TTD SUB TEMPLES_ అక్టోబరు 5 నుండి 7వ తేదీ వరకు అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

Tirupati, 26 September 2018: The annual pavitrotsavams will be observed from October 5 to 7 in Sri Prasanna Venkateswara Swamy temple in Appalayagunta and Sri Venkateswara Swamy temple in Bengaluru with Ankurarpanam on October 4.

Vastu Homam, Raksha Bandhanam, Snapana Tirumanjanam and other rituals will be performed during these three days in the Yagasala of the respective temples.

On first day Pavitra Pratsita, second day Pavitra Samarpana and on final day Pavitra Purnahuti will be observed as per agamas.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అక్టోబరు 5 నుండి 7వ తేదీ వరకు అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి, 2018 సెప్టెంబరు 26: టిటిడికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 5 నుండి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. అక్టోబరు 4న సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం శాస్త్రోక్తంగా జరుగనుంది.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

అక్టోబరు 5న ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారికి అభిషేకం, యాగశాల కార్యక్రమాలు, స్నపనతిరుమంజనం, సాయంత్రం వీధి ఉత్సవం నిర్వహిస్తారు. అక్టోబరు 6న ఉదయం యాగశాల కార్యక్రమాలు, స్నపనతిరుమంజనం, పవిత్ర సమర్పణ చేపడతారు. అక్టోబరు 7న పూర్ణాహుతితో ఈ పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ, భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.