SRINIVASA KALYANAMS IN OCTOBER_ అక్టోబర్‌లో 13 ప్రాంతాలలో శ్రీనివాస కల్యాణాలు
Tirupati, 26 September 2018: The Srinivasa Kalyanams by TTD Srinivasa Kalyanam Project will be observed at different districts in the month of October.
These kalyanams will be performed between October 2 to 26 in Anantapur, Chittoor and Kurnool districts.
In Anantapur, the celestial kalyanams will be performed on October 2, 4, 5, 6 and 7 while in Chittoor on October 6, 21, 22, 23, 24, 25 and 26 and in Kurnool on October 3.
The Project officials are supervising the arrangements.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అక్టోబర్‌లో 13 ప్రాంతాలలో శ్రీనివాస కల్యాణాలు
తిరుపతి, 2018 సెప్టెంబర్ 26: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అక్టోబర్ 2 నుండి 26వ తేదీ వరకు అనంతపురం జిల్లాలో 6 ప్రాంతాలలో, చిత్తూరు జిల్లాలో 6 ప్రాంతాలలో, కర్నూలు జిల్లా ఒకచోట శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.
అనంతపురం జిల్లా:
– అక్టోబర్ 2వ తేదీన వజ్రకరూర్ మండలం, పుట్టిపాడు గ్రామంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
– అక్టోబర్ 4న ఉరవకొండ మండలం, లత్తవరం తాండాలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.
– అక్టోబర్ 5న బ్రహ్మసముద్రం మండలం, పాలవెంకటాపురం గ్రామంలోని శ్రీవారి కల్యాణం జరుగనుంది.
– అక్టోబర్ 6న పుట్టపర్తి మండల కేంద్రంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.
– అక్టోబర్ 7న యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.
– అక్టోబర్ 8న నార్పల మండలం, మాలవాడ్లపల్లి గ్రామంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.
చిత్తూరు జిల్లా:
– అక్టోబర్ 6న కుప్పం మండలం, ఊర్లోబానపల్లి గ్రామంలోని శ్రీ బేతరాయస్వామి వారి ఆలయ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.
– అక్టోబర్ 21న వి.కోట మండలం, మద్దిరాల గ్రామం పరిధిలోని ఎస్టీ కాలనీలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.
– అక్టోబర్ 22న శాంతిపురం మండలం, 121 పేడూరులో స్వామివారి కల్యాణం జరుగనుంది.
– అక్టోబర్ 23న గంగవరం మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.
– అక్టోబర్ 24న యాదమరి మండలం, బండివాళ్లవూరు క్రాస్ గ్రామంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.
– అక్టోబర్ 25 ఐరాల మండల కేంద్రాంలోని జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.
– అక్టోబర్ 26న పెనుమూరు మండలం, బత్తివంక గ్రామంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.
కర్నూలు జిల్లా:
– అక్టోబర్ 3న పత్తికొండ మండల కేంద్రంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.
అక్టోబర్ 6న చిత్తూరు జిల్లా కుప్పం మండలం ఊర్లోబానపల్లిలో జరిగే శ్రీవారి కల్యాణం ఉదయం 10 గంటలకు, మిగిలిన ప్రాంతాలలో అన్నిచోట్లా సాయంత్రం 6 గంటలకు కల్యాణాలు ప్రారంభంకానున్నాయి.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.