APPALAYAGUNTA PAVITROTSAVAMS POSTERS RELEASED_ అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయ పవిత్రోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ
Tirupati JEO Sri P Bhaskar released the posters of annual pavitrotsavams in Appalayagunta temple in his chambers in TTD administrative building in Tirupati on Friday evening.
Speaking on this occasion, the JEO said, the three day fete will be observed from September 16-18 with Ankurarpanam on September 15. “On the first day Pavitra Pratista, second day Pavitra Samarpana and on final day Pavitra Purnahuti will be performed”, he added.
Spl Gr DyEO Sri Munirathnam Reddy, Sri Srinivasulu were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయ పవిత్రోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ
సెప్టెంబర్ 08, తిరుపతి, 2017 : టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతి సమీపంలోని అప్పలాయగుంటలో గల శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయ పవిత్రోత్సవాల గోడపత్రికలను తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ ఆవిష్కరించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల జెఈవో కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ సెప్టెంబరు 15న పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరుగనుందని తెలిపారు. సెప్టెంబరు 16న పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 18న పూర్ణాహుతి జరుగనున్నాయని వివరించారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం స్నపన తిరుమంజనం, సాయంత్రం వీధి ఉత్సవం నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథ, భజనలు, కోలాటాలు, ఇతర సంగీత కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.