APPALAYAGUNTA PAVITROTSAVAMS_ సెప్టెంబరు 16 నుంచి 18వ తేదీ వరకు అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు

Tirupati, 27 August 2017: The annual Pavitrotsavams in the famous temple of Lord Sri Prasanna Venkateswara Swamy in Appalayagunta will be observed from September 16-18 with Ankurarpanam on September 15.

On first day Pavitra Pratistha, second day Pavitra Samarpana and final day Purnahuti will be performed.

During these three days, Snapana Tirumanjanam to deities and Veedhi Utsavam will be observed.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

సెప్టెంబరు 16 నుంచి 18వ తేదీ వరకు అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు

ఆగస్టు 27, తిరుపతి, 2017: టిటిడికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయంలో ఆలయంలో సెప్టెంబరు 16 నుండి 18వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. సెప్టెంబరు 15న పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం నిర్వహిస్తారు.

సెప్టెంబరు 16న పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 17న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 18న పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఈ మూడు రోజుల పాటు ఉదయం స్నపనతిరుమంజనం, సాయంత్రం వీధి ఉత్సవం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథ, భజనలు, కోలాటాలు, ఇతర సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.