APPLICATIONS ARE INVITED FOR SV DANCE AND MUSIC COLLEGE FROM JUNE 10 _ ఎస్వీ సంగీత, నృత్య క‌ళాశాల‌లో అడ్మిషన్స్ కోసం జూన్ 10 నుండి దరఖాస్తుల స్వీకరణ

  • ADMISSION IS OPEN FOR PART-TIME COURSES IN VOCAL, VEENA, VIOLIN, FLUTE, MRIDANGAM, BHARATA NATYAM, KUCHIPUDI

Tirupati, 05 June 2022:  Applications are invited for admissions to all evening part-time courses of Certificate, Diploma, and Kala Pravesika from June 10 onwards in the TTD – run SV College of Music and Dance.

According to the college Principal Sri M Sudhakar, the applications could be procured by the payment of  50 in the college office during working hours for Kala Pravesika (2 years) of TTD and Certificates course (4 years) and Diploma course (2 years) recognised by Potti Sriramulu Telugu University at Hyderabad.

The candidates should procure applications from June 10 and submit them with all relevant Xerox copies by June end.

For more details contact 0877-2264597 / 7330811173  / 9391599995 or log in to TTD website www.tirumala.org.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ సంగీత, నృత్య క‌ళాశాల‌లో అడ్మిషన్స్ కోసం జూన్ 10 నుండి దరఖాస్తుల స్వీకరణ

– సాయంత్రం 5.30 నుండి 6.30 వరకు ఒక గంట పార్ట్‌టైమ్ కోర్సుల్లో గాత్రం, వీణ, వయొలిన్, వేణువు, మృదంగం , భరతనాట్యం, కూచిపూడి నృత్యం విభాగాల్లో ప్ర‌వేశాలు

తిరుపతి, 2022 జూన్ 05: తిరుపతి లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర సంగీత‌, నృత్య క‌ళాశాల‌లో సాయంత్రం పార్ట్‌టైమ్ సర్టిఫికేట్, డిప్లొమా, కళాప్రవేశిక కోర్సుల ప్ర‌వేశానికి జూన్ 10వ తేదీ నుండి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రిన్సిపల్ శ్రీ ఎం.సుధాక‌ర్ ఆదివారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

ఈ క‌ళాశాల‌లో హైద‌రాబాదులోని పొట్టి శ్రీ‌రాములు తెలుగు యూనివ‌ర్సిటీ గుర్తింపుపొందిన స‌ర్టిఫికెట్ కోర్సు(4 ఏళ్లు), డిప్లొమా కోర్సు(2 ఏళ్లు) ఉన్నాయి. టిటిడి నిర్వహించే క‌ళాప్ర‌వేశిక‌ (రెండేళ్ల ఫౌండేష‌న్ కోర్సు) అప్లికేషన్ రూ 50 చెల్లించి కార్యాలయంలో కార్యాలయ పని వేళల్లో పొందవచ్చునని చెప్పారు..
పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తుల‌ను జూన్ 10 నుండి అన్ని జిరాక్స్ కాపీలతో కలిపి జూన్ నెలాఖరు లోపు సమర్పించాలని ఆయన తెలిపారు.
ఇత‌ర వివ‌రాల‌కు 0877-2264597 / 7330811173 / 9391599995 ఫోన్ ద్వారా లేదా టిటిడి వెబ్‌సైట్ www.tirumala.org ను సంప్ర‌దించ‌గ‌ల‌రు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.