APPLICATIONS INVITED _ మే 25వ తేదీ నుండి ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, నాదస్వర పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
TIRUPATI, 09 MAY 2024: Applications are invited from the interested candidates to apply for regular and part-time courses in the TTD-run Sri Venkateswara College of Music and Dance, SV Nadaswaram and Dolu School for the academic year 2024-25.
The applications will be issued from May 25 onwards and the last date of receiving filled in application is June 12.
SV College of Music and Dance has full-time Visarada (Diploma), Praveena (Advanced Diploma) courses in Vocal, Violin, Veena, Flute, Nadaswaram, Bharatanatyam, Harikatha, Mridangam, Dolu, Ghatam. SV Nadaswaram, Dolu School has full-time certificate and diploma courses. Hostel facility will be provided to students from other areas.
Similarly, applications will be issued from May 25 onwards for admission into Evening Part-time Certificate, Diploma, Kala Pravesika Courses for the academic year 2024-25 into SVCMD, Nadaswaram and Dolu school and the last date of receiving filled-in applications is on June 12.
The full-time courses are available in Vocal, Violin, Veena, Flute, Nadaswaram, Bharatanatyam, Harikatha, Mridangam, Dolu, Ghatam as Visarada(Diploma) and Praveena(Advanced Diploma).
The part-time courses includes vocal, Devotional Music, Veena, Violin, Flute, Mridangam, Ghattam, Bharatanatyam, Kuchipudi Dance from 5.30 pm to 7.30 pm.
According to the college Principal Dr Uma Muddubala, the SVCMD has certificate course (4 years) and a diploma course (2 years) recognized by Potti Sri Ramulu Telugu University, Hyderabad. The application for Kala Pravesika (two-year foundation course) is conducted by TTD.
The applications for both regular and part-time courses can be obtained on payment of Rs 50.
For further details contact 0877-2264597 / 7330811173 / 9848374408 / 9440793205 during office hours on working days or visit TTD website at www.tirumala.org
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
మే 25వ తేదీ నుండి ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, నాదస్వర పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
తిరుపతి, 2024 మే 09: టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను పలు రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మే 25వ తేదీ నుండి కళాశాలలో దరఖాస్తులు జారీ చేస్తారు. పూర్తిచేసిన దరఖాస్తులను జూన్ 12వ తేదీ వరకు స్వీకరిస్తారు.
ఎస్వీ సంగీత, నృత్య కళాశాలలో గాత్రం, వయోలిన్, వీణ, ఫ్లూట్, నాదస్వరం, భరతనాట్యం, హరికథ, మృదంగం, డోలు, ఘటం విభాగాల్లో ఫుల్‌టైమ్ విశారద(డిప్లొమా), ప్రవీణ(అడ్వాన్డ్స్ డిప్లొమా) కోర్సులు ఉన్నాయి. ఎస్వీ నాదస్వరం, డోలు పాఠశాలలో ఫుల్‌టైమ్ సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులు ఉన్నాయి. ఇతర ప్రాంతాల విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించడం జరుగుతుంది.
ఆసక్తి గల అభ్యర్థులు కళాశాలలో రూ.50/- చెల్లించి దరఖాస్తు పొందొచ్చు. ఇతర వివరాలకు 0877-2264597, 7330811173, 9848374408, 9440793205 నంబర్లలో సంప్రదించగలరు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.