TTD ONLINE QUOTA FOR AUGUST _ మే 18న శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

TIRUMALA, 09 MAY 2024: TTD is all set to release the online quota of darshan, accommodation and srivari seva voluntary service for the month of August. Details as follows…
 
Srivari Arjitha Seva Tickets Electronic DIP Registration will be available from 10am of May 18 till 10 am of May 20. Seva Electronic Dip payment period is from May 20 to May 22 (upto 12noon).
 
Srivari Arjitha Seva Tickets viz.Kalyanam, Unjal Seva, Arjitha Brahmotsavam and SD Seva along with Annual Pavitrotsavam tickets(August 15-17) will be available from 10 AM of May 21 while Virtual Seva tickets on the same day at 3pm.
 
Tirumala Angapradakshinam Tokens will be available from May 23 at 10AM.
 
Darshan and Accommodation quota to the SRIVANI Trust Donors will be available on May 23 at 11AM.
 
Senior Citizens/Physically Challenged quota will be available from
3pm of May 23.
 
The Special Entry Darshan (Rs.300) tickets will be available on April 24 at 10 AM.
 
Tirumala & Tirupati Accommodation Quota will be available from 3pm of May 24.
 
The Srivari Seva voluntary service General quota for Tirumala and Tirupati will be released at 11am while Navaneeta Seva at 12noon and Parakamani Seva at 1pm on May 27.
 
For bookings log onto TTD Official Web site only: ttdevasthanams.ap.gov.in    
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 18న శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

తిరుమల, 2024 మే 09: తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల కోటాను మే 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు మే 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటా, అదేవిధంగా శ్రీ‌వారి ఆల‌యంలో ఆగ‌స్టు 15 నుండి 17వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న వార్షిక ప‌విత్రోత్స‌వాల సేవా టికెట్లను మే 21వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

మే 21న వర్చువల్ సేవల కోటా విడుదల

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల కోటాను మే 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

మే 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు….

ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మే 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా….

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆగ‌స్టు నెల ఆన్ లైన్ కోటాను మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఆగ‌స్టు నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను మే 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

మే 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌

తిరుమల, తిరుపతిల‌లో ఆగ‌స్టు నెల గదుల కోటాను మే 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

మే 27న శ్రీవారి సేవ కోటా విడుదల

మే 27న తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.