APPLICATIONS INVITED FOR ADMISSION AT SV ORIENTAL DEGREE COLLEGE _ ఎస్వీ ఓరియంట‌ల్ డిగ్రీ క‌ళాశాల‌లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

Tirupati,14 July 2022: TTD has invited applications from eligible candidates for  Inter and degree courses at the TTD – run Sri Venkateswara Oriental Degree college.

For the two-year Pre-degree courses in Sanskrit, Telugu, and Hindi students should be above 18 years and passed SSLC or any equivalent courses.

Similarly, for the 3-year degree courses in Sanskrit, Telugu, and Hindi, the candidate should be above 21 years and with Pre-degree (Inter) or equivalent qualifications.

The eligible students should procure applications from the college premises on KT Road and submit the forms by August 25. Selected students (boys and girls) will be provided free hostel and boarding facilities.

For more details 0877 – 2264604, 0877 – 2263974  during office hours on working days.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ ఓరియంట‌ల్ డిగ్రీ క‌ళాశాల‌లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

తిరుపతి, 2022 జులై 14: టిటిడి శ్రీ వేంకటేశ్వర ఓరియంటల్ డిగ్రీ కళాశాలలో ప్రీ డిగ్రీ (ఇంటర్ ), డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల‌ నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రెండేళ్ల‌ ప్రీ డిగ్రీలో సంస్కృతం, తెలుగు, హిందీ కోర్సులకు 18 ఏళ్ల‌ లోపు వయసు కలిగి ఎస్ఎస్‌సి లేదా తత్సమాన విద్యార్హత కలిగిన విద్యార్థులు అర్హులు. మూడేళ్ల‌ సంస్కృతం, తెలుగు, హిందీ డిగ్రీ కోర్సులకు 21 సంవత్సరాల లోపు వయసు కలిగి ప్రీ డిగ్రీ, ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలి.

కె.టి. రోడ్డులోని కళాశాల కార్యాలయంలో రూ.25/- చెల్లించి దరఖాస్తులు పొందవచ్చు. పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తుల‌ను ఆగ‌స్టు 25వ తేదీలోపు సమర్పించాలి. ప్రవేశం లభించిన విద్యార్థిని, విద్యార్థులకు వేర్వేరుగా ఉచితంగా భోజనం ,హాస్టల్ సదుపాయం కల్పిస్తారు. ఇతర వివరాలకు 0877 – 2264604, 0877 – 2263974 నంబర్లను సంప్రదించ‌గ‌ల‌రు.

టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.