APPLICATIONS INVITED FOR DHANUR MASAM THIRUPPAVI LECTURES_ తిరుప్పావై ఉపన్యాసాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

Tirupati, 11 Sep. 19: TTD has invited applications from well known Vedic pundits proficient in Vaishnava philosophy for rendering Thiruppavai lectures during Dhanurmasam from December 17-January 14, 2020.

The lectures are conducted across the country under the aegis of TTD Alwar Divya Prabandam Project. Interested pundits are asked to apply from 15 September – October 15 to Special Officer, Alwar Divya Prabandam Project SVETA Bhavan, and Tirupati.

Conditions and applications can be downloaded from www.tirumala.org and www.tirupati.org.

For other details contact office of Alwar Divya Prabandam Project on 0877-2264447, 0877-2264083, mobile: 9908577715.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుప్పావై ఉపన్యాసాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుప‌తి, 2019 సెప్టెంబరు 11: పవిత్రమైన ధనుర్మాసంలో 2019 డిసెంబరు 17 నుంచి 2020 జనవరి 14వ తేదీ వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుప్పావై ఉపన్యాసాలు చేసేందుకు సమర్థులైన శ్రీవైష్ణవ సిద్ధాంతం తెలిసిన పండితుల నుంచి దరఖాస్తులు, అంగీకార పత్రాలను టిటిడి ఆహ్వానిస్తోంది.

టిటిడి ఆళ్వార్‌ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతి ఏటా ధనుర్మాసంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుప్పావై ఉపన్యాసాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అర్హులైనవారు ఈ ఏడాది సెప్టెంబ‌రు 15 నుండి అక్టోబరు 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ”ప్రత్యేకాధికారి, ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు, శ్వేత భవనం, టిటిడి, తిరుపతి” అనే చిరునామాకు దరఖాస్తులు, అంగీకార పత్రాలు పంపాల్సి ఉంటుంది. అంగీకార పత్రాలు ఇచ్చే పండితుల పట్టికతోపాటు, షరతులు, దరఖాస్తులను www.tirumala.org మరియు www.tirupati.org వెబ్‌సైట్ల నుంచి పొందొచ్చు.

ఇతర వివరాలకు టిటిడి ఆళ్వార్‌ దివ్య ప్రబంధ ప్రాజెక్టు కార్యాలయాన్ని 0877-2264447, 0877-2264083, సెల్‌ : 9908577715 నంబర్ల ద్వారా సంప్రదించగలరు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.