PAVITRA PRATHISTA AT DEVUNI KADAPA SRI LV TEMPLE_ దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా ప‌విత్ర ప్ర‌తిష్ఠ

Tirupati, 11 Sep. 19: The Day one ritual of Pavitra Pratista as part of ongoing Pavitrotsavam was traditionally performed at the Sri Lakshmi Venkateswara temple at Devuni Kadapa on Wednesday morning.

The artists nit TTD Cultural wings of HDPP, and Annamacharya project and Dasa Sahitya Project presented Harikatha, bhajans, and Bhakti sangeet on all three days.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా ప‌విత్ర ప్ర‌తిష్ఠ

తిరుప‌తి, 2019 సెప్టెంబరు 11: టిటిడి పరిధిలోని వైఎస్‌ఆర్ జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప‌విత్రోత్స‌వాల సంద‌ర్భంగా మొద‌టి రోజు బుధ‌వారం ప‌విత్ర ప్ర‌తిష్ఠ శాస్త్రోక్తంగా జ‌రిగింది.

ఇందులోభాగంగా ఉదయం చ‌తుష్ఠార్చ‌న‌, యాగశాలపూజ, పవిత్రప్రతిష్ఠ, సాయంత్రం నిత్య హోమం నిర్వహించారు. సెప్టెంబరు 12 పవిత్ర సమర్పణ, పవిత్ర హోమం నిర్వహిస్తారు. సెప్టెంబరు 13న స్నపనతిరుమంజనం, మహాపూర్ణాహుతి, పవిత్ర వితరణ, వీధి ఉత్స‌వం త‌దిత‌ర కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.