APRIL HIGHLIGHTS _ శ్రీవారి భక్తులకు విస్తృత ఏర్పాట్లు – ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి
శ్రీవారి భక్తులకు విస్తృత ఏర్పాట్లు – ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి
తిరుమల, 03 మే 2024: తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని, అందుకు తగ్గట్టు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి పునరుద్ఘాటించారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం ఈవో మీడియా సమావేశంలో ఏప్రిల్ నెలలో భక్తులకు సంబంధించిన దర్శనం మరియు ఇతర వివరాలను తెలిపారు.
ఏప్రిల్ నెలలో నమోదైన వివరాలు :
దర్శనం :
– శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ` 20.17 లక్షలు.
హుండీ :
– హుండీ కానుకలు ` రూ.101.63 కోట్లు.
లడ్డూలు :
– విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య ` 94.22 లక్షలు.
అన్నప్రసాదం :
– అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య ` 39.73 లక్షలు.
కల్యాణకట్ట :
– తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య ` 8.08 లక్షలు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.