APSCPCR VISITS TIRUMALA _ తిరుమ‌ల‌లోని వేద పాఠ‌శాల, క‌ల్యాణ‌వేదిక‌ను ప‌రిశీలించిన బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్‌

Tirumala, 07 September 2022: The Honourable Chairman of AP State Commission for the Protection of Child Rights(APSCPCR), Sri Kesali Appa Rao along with the members Smt Triparna Adilakshmi and Smt Lakshmi Devi visited Tirumala and inspected different places on Wednesday.

The Commission inspected Dharmagiri Veda Vignana Peetham and interacted with the students and verified the amenities being provided to them including classes, hostels etc. They directed the Principal Sri KSS Avadhani and other officials to ensure that the children are being imparted a pressure-free education with disciplene in a friendly environment.

At Kalyana Vedika, they instructed the officials concerend to display boards on “No Child Marriages” and also learnt the procedure for performing marriages at this venue.

Later they also visited Srivari temple surrounding areas, shopping complex and sites where construction works are under progress and verified the child rights and protection norms.SE 2 Sri Jagadeeshwar Reddy, Health Officer Dr Sridevi, Deputy EO Kalyanakatta Sri Selvam, Commission Liasion Officer Sri Anandaraju, DCPO Sri Suresh, VGO Sri Bali Reddy, AEO Kalyanakatta, Sri Ramakanth were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

తిరుమ‌ల‌లోని వేద పాఠ‌శాల, క‌ల్యాణ‌వేదిక‌ను ప‌రిశీలించిన బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్‌

తిరుమ‌ల‌, 2022 సెప్టెంబ‌రు 07: రాష్ట్ర బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్ ఛైర్మ‌న్ శ్రీ కేస‌లి అప్పారావు, స‌భ్యులు శ్రీ‌మ‌తి త్రిప‌ర్ణ ఆదిల‌క్ష్మి, శ్రీ‌మ‌తి ముడిమేల ల‌క్ష్మీదేవి బుధ‌వారం ఉద‌యం తిరుమ‌ల‌లోని వేద పాఠ‌శాల‌, క‌ల్యాణ‌వేదికను ప‌రిశీలించారు.

వేద పాఠ‌శాల‌లో విద్యార్థుల‌తో స‌మావేశమ‌య్యారు. అక్క‌డి వ‌స‌తులు, త‌ర‌గ‌తి గ‌దుల‌ను ప‌రిశీలించారు. అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చారు. బాల‌ల‌కు ఒత్తిడి లేకుండా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో కూడిన విద్య అందించాల‌ని సూచించారు. క‌ల్యాణ‌వేదికలో వివాహాలకు అనుమ‌తి ఇచ్చే విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. బాల్య వివాహాలు జ‌రుప‌రాద‌ని బోర్డులు ప్ర‌ద‌ర్శించాల‌ని సూచించారు. అనంత‌రం శ్రీ‌వారి ఆల‌య ప‌రిస‌రాలు, ముఖ్య‌మైన కూడ‌ళ్ల‌లో భిక్షాట‌న చేస్తున్న బాల‌ల‌ను గుర్తించి వారికి పునరావాసం క‌ల్పించాల‌ని అధికారులకు సూచించారు. అంతకుముందు షాపింగ్ కాంప్లెక్స్, అతిథి గృహాల నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలను కమిషన్ పరిశీలించింది.

క‌మిష‌న్ వెంట టిటిడి ఎస్ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, డిసిపివో శ్రీ సురేష్‌, హెల్త్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ శ్రీ‌దేవి, లైజాన్ ఆఫీస‌ర్ శ్రీ ఆనంద‌రాజు, డెప్యూటీ ఈవో శ్రీ సెల్వం, విజివో శ్రీ బాలిరెడ్డి, క‌ల్యాణ‌క‌ట్ట ఏఈవో శ్రీ ర‌మాకాంత్ త‌దిత‌రులు ఉన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.