BASHYA PARAYANAM HELD ON THE OCCASION OF VAMANA JAYANTI IN SRINIVASA MANGAPURAM _ లోక‌క్షేమం కోసం శ్రీనివాసమంగాపురంలో భాష్య పారాయణం

Tirupati, 07 September 2022:  On the occasion of Vamana Jayanti Bashya Parayanam was held at Sri Kalyana Venkateswara Swamy temple in Srinivasa Mangapuram on September 7 under the aegis of Hindu Dharma Prachara Parishad wing of TTD.

Twelve Vedic pundits proficient in Sri Shankaracharya’s Advaitam, Sri Ramanujacharya’s Vishistadvaitam and Sri Madhwacharya’s Dwaitam and Lakshmi Vishistadvaitam of Vaikhanasa tradition rendered respective Mantras seeking global well-being.

TTD has commenced a new practice and tradition of conducting Parayanam of Bashya in consonance with Upanishad Mantras.

TTD Agama Advisor Acharya Vedantam Vishnu Bhattacharyulu acted as convener of the program.

Deputy EO Smt Shanti, Archaka Sri Balaji Rangacharyulu and other temple staff were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

లోక‌క్షేమం కోసం శ్రీనివాసమంగాపురంలో భాష్య పారాయణం

తిరుప‌తి, 2022 సెప్టెంబ‌రు 07: వామన జయంతిని పురస్కరించుకుని శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో లోక‌క్షేమం కోసం బుధ‌వారం భాష్య పారాయణం జరిగింది.

ఈ సంద‌ర్భంగా ఆల‌యంలోని శ్రీ వ్యాసుల వారి బ్ర‌హ్మ‌సూత్రాలు, శ్రీ శంకరాచార్యులవారి అద్వైతం, శ్రీ రామానుజాచార్యుల వారి విశిష్టాద్వైతం, శ్రీ మధ్వాచార్యుల వారి ద్వైతం, వైఖానస సాంప్రదాయ లక్ష్మీ విశిష్టాద్వైతం భాష్యాలను 12 మంది ఆయా శాస్త్ర పండితులు పారాయణం చేశారు. ఉపనిషత్ మంత్రాల సమన్వయంతో కూడిన భాష్యాలను పారాయణం చేయడం ద్వారా లోకం సుభిక్షంగా ఉంటుంద‌ని, ప్ర‌జ‌లంద‌రూ సుఖ‌సంతోషాల‌తో ఉంటార‌ని టిటిడి ఆగమ సలహాదారు ఆచార్య వేదాంతం విష్ణుభట్టాచార్యులు తెలిపారు. టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమ‌తి వ‌ర‌ల‌క్ష్మి, ప్ర‌ధానార్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీ మునిచెంగ‌ల్రాయ‌లు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ కిర‌ణ్‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.