ARCHAKAS ARE ROLE MODEL TO SOCIETY-TIRUPATI JEO_ యువతను ఆధ్యాత్మికత వైపునకు అర్చకులు మళ్లించాలి – తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్

Tirumala, 30 September 2017: Archakas who render services to deities in temples in a systematic way with devotion and discipline are role model to society said Tirupati JEO Sri P Bhaskar.

Addressing the valedictory session of fortnight training program of archakas belonging to twin Telugu states in SVETA at Tirupati onSaturday, the JEO said, the trained archakas should go to their home turfs and render the Puja in the same manner and imbibe devotion among your locals”, he added.

Later certificates and Puja articles, books were distributed to the trained archakas. Special officer Sri Muktheswara Rao was also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD,TIRUPATI

యువతను ఆధ్యాత్మికత వైపునకు అర్చకులు మళ్లించాలి – తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుపతి, 30 సెప్టెంబరు 2017: గ్రామాలలోని యువతను ఆధ్యాత్మిక రంగం వైపు మరల్చడానికి అర్చకులు కృషి చేయాలని టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌ ఉద్ఘాటించారు. తిరుపతిలోని శ్వేతా భవనంలో రెండు తెలుగు రాష్ట్రాలలోని 30 మందికి 15 రోజులుగా ఇస్తున్న అర్చక శిక్షణ శనివారం ముగిసింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ అర్చకులను దైవసమానులుగా బావిస్తారని, స్వామివారి కైంకర్యం చేయడం పూర్వజన్మ పుణ్యఫలమన్నారు. అర్చకులు ఆలయాలలో నిరంతరం ఆరాధన చేయడమేగాకా ప్రజలలో ఆధ్యాత్మిక చైతన్యం నింపడానికి కృషి చేయాలని సూచించారు. సత్‌ప్రవర్తనతో అర్చకత్వాని ఆలయాలలో నిర్వహిస్తు, భజన సాంప్రదాయాన్ని ప్రోత్సహించాలన్నారు. తమ గ్రామాలలో జరిగే ధర్మ ప్రచార కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాబోవు రోజులలో మూడు విడతలుగా నెల రోజుల పాటు అర్చక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలియజేశారు.

అనంతరం అర్చక శిక్షణ పొందినవారికి ధృవీకరణ పత్రాలు, స్వామి, అమ్మవారి చిత్ర పటం, పూజ సామగ్రి, శ్రీవారి తీర్థప్రసాదాలను జెఈవో పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీ ముక్తేశ్వరరావు, హిందూ ధర్మ ప్రచార పరిషత్తు కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.