MAMMOTH CHARIOT MARCHES ALONG FOUR MADA STREETS_ భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు

CAR FESTIVAL OBSERVED WITH RELIGIOUS POMP AND GAIETY

Tirumala, 30 September 2017: On the eighth day on Sunday, the Lord Malayappa Swamy flanked by His two consorts Sridevi and Bhudevi on His either sides, took celestial ride on the mammoth wooden chariot in the four mada streets of Tirumala on the penultimate day of Srivari annual brahmotsavams.

SIGNIFICANCE

“Rathotsavam Kesavam Dristwa Punarjanma Na Vidhate”

meaning with just a glimpse of Lord on Ratham, one will be free from all bonds and will have no rebirth. The Kathopanishad describes affinity of the body and soul comparing with the car festival. The body is the chariot, discrimination is the charioteer, the senses are horses, the soul which is the spark of divinity within us is the traveller of the chariot.

DEVOUT TAKE PART IN CAR PULLING

Among the important events during the nine-day brahmotsavams, Rathotsavam is considered to be most splendid religious event that attracts the attention of pilgrims, as it is a unique fete where the devotees are allowed to pull the chariot.

GOVINDA NAMA REVERBERATES

The devotees pulled the strong ropes with all their energies and with devotional fervour chanting, “Govinda Govinda”. The entire temple premises echoed with the Govinda Nama as tens of thousands of pilgrims took part in this celestial event. It was a great visual treat to witness the procession of Lord Malayappa flanked by His two consorts Sridevi and Bhudevi on the gigantic wooden chariot.

TTD EO Sri Anil Kumar Singhal, JEOs Sri KS Sreenivasa Raju, Sri Pola Bhaskar, CVSO Sri Ake Ravikrishna, Temple DyEO Sri Rama Rao and others took part.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER,TTD,TIRUPATI

భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు

తిరుమల, 30 సెప్టెంబరు 2017: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన శనివారం ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు.

బ్రహ్మోత్సవాలలో ఎనిమిదవ రోజున ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీథులలో విహరింపజేసారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. గోవిందనామసంకీర్తనలు, పలురకాల భజనల నినాదాలు మిన్నుముట్టాయి.

అనాదికాలంనుండి రాజులకు రథసంచారం ప్రసిద్ధం. యుద్ధాలలో కూడా విరివిగా రథసంచారం జరిగినట్లు భారతాది గ్రంథాలు వివరిస్తున్నాయి. శ్రీహరి గరుడధ్వజుడై నాలుగు గుర్రాలు పూన్చిన రథంపై విహరిస్తాడు.

ఇక ప్రసిద్ధ దేవాలయాలలో ఉత్సవవేళలో దేవుని ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం, ఆగమశాస్త్ర సిద్ధమై బహుళ ప్రచారంలో ఉన్నది.

తిరుమలలో రథోత్సవం అన్నివిధాలా ప్రసిద్ధమైనది. ”రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మనవిద్యతే” అన్న ఆర్షవాక్కులు రథోత్సవం మోక్షప్రదాయకమని వివరిస్తున్నాయి. తిరుమాడ వీథులలో రథాన్ని లాగేటప్పుడు ప్రమాదాలు జరుగకుండా తిరుమల తిరుపతి దేవస్థానమువారు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. రథానికి తాళ్ళుకట్టి వీథులలో భక్తులు, అధికారులు అందరూ రథాన్ని ముందుకు లాగారు.

రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మికార్థం ఉన్నది. కఠోపనిషత్తులో ఆత్మకూ శరీరానికీ ఉండే సంబంధాన్ని రథరూపకల్పనతో వివరించడం జరిగింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీథులు, ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో – స్థూలశరీరంవేరనీ, సూక్ష్మశరీరంవేరనీ, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వ జ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు. కానీ, అన్నమయ్య సకలజీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తనరథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితంగా ఉన్నది.

కాగా సాయంత్రం 7.00 నుండి 8.00 గంటల వరకు ఊంజల్‌ సేవ వైభవంగా జరగనుంది.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్‌, టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌, జెఈవో శ్రీకె.యస్‌.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.