ARCHAKA TRAINING CONCLUDES IN SVETA_ ఏడాదిలో 505 మంది ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు అర్చక శిక్షణ : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్
Tirupati, 30 May 2018: The 17th batch of Archaka Training classes from the year 2017 May to 2018 May completed in SVETA building in Tirupati on Wednesday.
Addressing the session Tirupati JEO Sri P Bhaskar said, to safeguard the Hindu temples, TTD has commenced training SC, ST and BCs in priesthood from the past several years. In the last one year 505 persons underwent training which includes 295 SCs, 190 STs and 90 BCs.
Later he has given the puja kit and book to all the archakas who underwent training in the 17th batch. HDPP Chief Sri Ramanaprasad, Epic Exams co-ordinator Sri Damodar Naidu, AEO Sri Nageswara Rao, Superintendent Sri Gurnatham were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఏడాదిలో 505 మంది ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు అర్చక శిక్షణ : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్
మే 30, తిరుపతి, 2018: ధర్మప్రచారంలో భాగంగా 2017 మే నుండి 2018 మే వరకు ఏడాది కాలంలో రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన 505 మంది ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు అర్చక శిక్షణ ఇచ్చామని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ వెల్లడించారు. తిరుపతిలోని శ్వేత భవనంలో బుధవారం సాయంత్రం 17వ బ్యాచ్ అర్చక శిక్షణ సమాపనోత్సవం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ దేవాలయ వ్యవస్థ భారతీయ సంస్కృతిలో ఒక భాగమని, దీన్ని పరిరక్షించుకోవాలని కోరారు. ఆలయాల్లో పురాణయుక్తంగా అర్చకత్వం చేసేందుకు వర్గాలతో సంబంధం లేకుండా ఎవరైనా అర్హులేనని చెప్పారు. అర్చకుడు వ త్తి ధర్మాన్ని పాటిస్తూ ధర్మాచరణ వైపు ప్రజలను నడిపించాలన్నారు. ముఖ్యంగా యువతను భక్తిమార్గం వైపు మళ్లించాలని, ఆధ్యాత్మిక చింతన లేకపోతే జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకోలేరని అన్నారు. అర్చక శిక్షణలో ధర్మం, దేవాలయం, అర్చకత్వం, అర్చకుడు – సమాజ భాగస్వామ్యం అనే అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించినట్టు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఎక్కువ మందికి అర్చక శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఏడాది కాలంలో 17 బ్యాచ్‌లలో 295 మంది ఎస్‌సిలు, 190 మంది ఎస్‌టిలు, 90 మంది బిసిలకు శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు.
అనంతరం జెఈవో చేతుల మీదుగా పూజాసామగ్రి, ధ్రువీకరణపత్రం, శ్రీవారి చిత్రపటం, ప్రసాదాలను శిక్షణ పొందిన అర్చకులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి డా|| రమణప్రసాద్, ధార్మిక పరీక్షల ప్రత్యేకాధికారి ఆచార్య జి.దామోదరనాయుడు, ఏఈవో శ్రీ నాగేశ్వరరావు, సూపరింటెండెంట్ శ్రీ గురునాథం, శిక్షణ పూర్తి చేసుకున్న 18 మంది అర్చకులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.