COUNSELLING FOR ADMISSION INTO TTD COLLEGES_ టిటిడి డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి జూన్‌ 4 నుండి 9వ తేదీ వరకు కౌన్సెలింగ్‌

Tirupati, 31 May 2018: The counselling for admission into TTD colleges for the academic year 2018-19 will be organised from June 4-9.

9850 students have applied for admission into 4990 seats available in the colleges including SGS, SV Arts, SPWDPG. As per the government rules, reservation guidelines and as per the marks obtained in Intermediate.

The students have already received the SMS to appear for counselling to their registered mobile number. The students should note that just because they received SMS they are not selected. They should attend the counselling otherwise seat will be allocated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి జూన్‌ 4 నుండి 9వ తేదీ వరకు కౌన్సెలింగ్‌

మే 31, తిరుపతి 2018: టిటిడి ఆధ్వర్యంలోని డిగ్రీ కళాశాలల్లో 2018-19వ విద్యా సంవత్సరానికి గాను పలు కోర్సుల్లో ప్రవేశానికి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్‌ కళాశాలలో జూన్‌ 4 నుండి 9వ తేదీ వరకు కౌన్సెలింగ్‌ జరుగనుంది. ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల, ఎస్‌జిఎస్‌ ఆర్ట్స్‌ కళాశాల, ఎస్‌పిడబ్ల్యు డిగ్రీ కళాశాలల్లో అన్ని కోర్సులు కలిపి మొత్తం 4,990 సీట్లు ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి 9,850 మంది విద్యార్థిని విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రిజర్వేషన్ల ప్రకారం, విద్యార్థులు ఇంటర్మీడియెట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా డిగ్రీ కోర్సుల్లో, వసతిగృహాల్లో ప్రవేశం కల్పిస్తారు.

విద్యార్థులు కౌన్సెలింగ్‌కు ఏ తేదీన హాజరుకావాలనే విషయాన్ని ఇదివరకే వారి మొబైల్‌ ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌ రూపంలో పంపారు. ఈ విషయాన్ని admission.tirumala.org వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచారు. కావున విద్యార్థులు వారికి కేటాయించిన తేదీ, సమయానికి హాజరుకావాలని తెలియజేయడమైనది. ఎస్‌ఎంఎస్‌ సమాచారం అందినంత మాత్రాన సీటు కేటాయించినట్టు కాదని, కౌన్సెలింగ్‌కు గైర్హాజరైతే సీట్లు కేటాయించబడవని టిటిడి తెలియజేసింది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.