ARRANGEMENTS BY TTD PROVIDE RELIEF TO PILGRIMS _ సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో భక్తుల సేవలో తరించిన తితిదే

Tirupati, 30 Aug: In the wake of two day bandy call given by Samikhayandhra, JAC, TTD has made elaborate arrangements especially the transport and food distribution to see that no inconvenience is caused to the visiting pilgrims in twin pilgrim town during the last two days. The arrangements by TTD provided a feel-good pilgrimage to the multitude of visiting pilgrims. 
 
Under the instructions of TTD EO Sri M.G.Gopal, the TTD Transport and Annaprasadam wings have carried out relief operations in a big way under the supervision of Tirumala JEO Sri K.S.Sreenivasa Raju on Wednesday and Thursday. 
 
Over 77,000 thousand pilgrims have been transported from Tirupati Railway Station to Alipiri Bus Stand and from Alipiri Bus stand to Railway Station in 1160 trips in 16 buses from 4am till the end of the day on both the days. Similarly has many hotels and motels remained closed in view of the bandh, TTD has made alternative food arrangements tot he visiting pilgrims near railway station, Aliperi bus stand, Aliperi Padala Mandapam. Over 70 thousand pilgrims have been supplied with umpa, sambar bath, curd rice while 38 thousand pilgrims were distributed milk. 
 
on the other hand the Chief Vigilance and Security Officer Sri GVG Ashok kumar has monitored the security arrangements at various points to see that pilgrims are not put to any sort of inconvenience.
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో భక్తుల సేవలో తరించిన తితిదే

తిరుపతి, ఆగస్టు 30, 2013: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా చేపట్టిన రెండు రోజుల అష్టదిగ్బంధనం నేపథ్యంలో తిరుపతిలోని పలు ఫలహారశాలలు, భోజనశాలలను మూసివేయడంతో తిరుమలకు వచ్చే భక్తులకు భోజనం, రవాణా విషయంలో ఎలాంటి

అసౌకర్యం కలగకుండా తితిదే బుధ, గురువారాల్లో విస్తృత ఏర్పాట్లు చేసింది.
మొదటి రోజైన బుధవారం తితిదేకి చెందిన 16 బస్సులు తిరుపతి రైల్వే స్టేషన్‌ – అలిపిరి మధ్య 500 ట్రిప్పులు తిరిగి 35 వేల మంది భక్తులను తరలించాయి. రెండో రోజైన గురువారం తితిదే బస్సులు 650 ట్రిప్పులు తిరిగి 42 వేల మంది భక్తులను తరలించాయి. రెండు రోజుల్లో కలిపి మొత్తం 1150 ట్రిప్పుల్లో 77 వేల మంది భక్తులను తరలించాయి.
తిరుపతి రైల్వేస్టేషన్‌, అలిపిరి వద్ద మొదటి రోజు 16 వేల మంది భక్తులకు పాలు, 45 వేల మంది భక్తులకు అన్నప్రసాదం(సాంబారన్నం, పెరుగన్నం), రెండో రోజు 22 వేల మందికి పాలు, 25 వేల మందికి అన్నప్రసాదం అందించారు. రెండు రోజుల్లో కలిపి ఉదయం 7.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు 38 వేల మందికి పాలు, 70 వేల మందికి అన్నప్రసాదాన్ని తితిదే అధికారులు పంపిణీ చేశారు.

తితిదే విజిలెన్స్‌ అధికారులు పోలీసులతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్‌, ఆర్‌టిసి బస్టాండు, శ్రీనివాసం, లీలామహల్‌ జంక్షన్‌, నంది సర్కిల్‌, అలిపిరి బస్టాండు వద్ద తితిదే విజిలెన్స్‌ అధికారులు అప్రమత్తంగా ఉండి భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూశారు.

ఈ మొత్తం ఏర్పాట్లను తితిదే ఈవో శ్రీ ఎం.జి.గోపాల్‌ ఆదేశాల మేరకు తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌ కుమార్‌, విజిఓ శ్రీ హనుమంతు, ట్రాన్స్‌పోర్టు జనరల్‌ మేనేజర్‌ శ్రీ శేషారెడ్డి, అన్నదానం డెప్యూటీ ఈవో శ్రీ వేణుగోపాల్‌, క్యాటరింగ్‌ ఆఫీసర్‌ శ్రీ దేశాయ్‌రెడ్డి, హెల్త్‌ యూనిట్‌ ఆఫీసర్‌ శ్రీ సుబ్రమణ్యం, ఎవిఎస్‌ఓలు, డ్యూటీ ఇన్‌స్ట్రక్టర్లు, ఇతర ఇంజినీరింగ్‌ అధికారులు పర్యవేక్షించారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.