ARRANGEMENTS COMPLETED FOR RADHASAPTHAMI IN TIRUMALA_ తిరుమలలో రథసప్తమికి ముమ్మరంగా ఏర్పాట్లు
Tirumala, 10 Feb. 19: All the arrangements were almost completed in Tirumala for the big event of Radhasapthami on February 12.
Of 175 galleries spread across the four mada streets 55 counters were set up to distribute food to pilgrims sitting in galleries with the help of srivari sevakulu. Water line is also set up to cater the drinking water needs of pilgrims in galleries. The galleries are provided with temporary shelter as a shield from inclement weather conditions.
Meanwhile white cooler paint, rangolis were also drawn all along four mada streets.
The Hindu Dharma Prachara Parishad has invited Kolatam and bhajana trams from different places to perform before vahanams on that day.
A senior officer has been allotted duty to man and supervise each mada street to monitor the pilgrim needs.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
తిరుమలలో రథసప్తమికి ముమ్మరంగా ఏర్పాట్లు
ఫిబ్రవరి 09, తిరుమల, 2019: తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 12న మంగళవారం రథసప్తమి పర్వదినానికి టిటిడి ముమ్మరంగా ఏర్పాట్లు చేపడుతోంది. ప్రతి సంవత్సరం మాఘ మాసంలో సప్తమినాడు శ్రీ మలయప్పస్వామివారు ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహిస్తాడు. శ్రీవారి బ్రహ్మూెత్సవాల తరువాత అంతటి ప్రధానమైన పర్వదినంగా రథసప్తమిని నిర్వహిస్తారు. ఈ కారణంగా ఈ పర్వదినాన్ని ఒకరోజు బ్రహ్మోత్సవాలు, ఉప బ్రహ్మోత్సవాలని పిలుస్తారు.
ఈ సందర్భంగా ప్రాత:కాలాధాన పూర్తయిన తరువాత శ్రీమలయప్పస్వామివారు ఆలయం నుండి వాహనమండపానికి వేంచేసి సూర్యప్రభ వాహనాన్ని అధిష్టిస్తారు. అక్కడినుండి ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకోగానే ”భీషోదేతి సూర్య:” అనే వేదశాసన ప్రకారం సూర్యుడు ఉదయించి తన సహస్ర కిరణాలను స్వామివారి పాదాలకు అర్పిస్తాడు. ఈ ఘట్టాన్ని దర్శించుకోవడాన్ని భక్తులు అపూర్వంగా భావిస్తారు. ఆ తరువాత చిన్నశేష, గరుడ, హనుమంత వాహనాలపై స్వామివారు విహరిస్తారు. మధ్యాహ్నం చక్రస్నానం అనంతరం కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు.
వాహనసేవలు తిలకించేందుకు వచ్చే భక్తులు చలికి, ఎండకు, వర్షానికి ఇబ్బందులు పడకుండా నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో తాత్కాలిక షెడ్లు, తూర్పు మాడ వీధిలో జర్మన్ షెడ్లు ఏర్పాటుచేశారు. శ్రీవారి భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు అందించేందుకు గ్యాలరీల్లో 55 ఫుడ్ కౌంటర్లు ఏర్పాటుచేశారు. ఇక్కడ భక్తులకు సమయానుకూలంగా టి, కాఫి, పాలు, మజ్జిగ, అల్పాహారం, పులిహోర ప్యాకెట్లు, టమోటా రైస్, బిసిబెళా బాత్ అందిస్తారు. మాడ వీధుల్లో భక్తులకు అందుబాటులో మరుగుదొడ్లు, మూత్రవిసర్జనశాలలు అందుబాటులో ఉంచారు. వాహనసేవలను తిలకించేందుకు వీలుగా 20 ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే ఆలయ మాడ వీధులను రంగవళ్లులతో అందంగా తీర్చిదిద్దారు. ఎండలో నడిచేందుకు ఇబ్బందిపడకుండా కూల్‌పెయింట్ వేశారు.
భక్తులకు భద్రతపరంగా ఇబ్బందులు లేకుండా టిటిడి నిఘా, భద్రతా సిబ్బంది, పోలీసులు, ఎస్‌పిఎఫ్ సిబ్బంది, ఎన్‌సిసి క్యాడెట్లు సేవలందిస్తారు. భక్తులకు సేవలందించేందుకు టిటిడి సిబ్బందితోపాటు శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను వినియోగించుకోనున్నారు. మాడ వీధుల్లోని గ్యాలరీల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులకు విధులు కేటాయించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీలో వాహనసేవలను ప్రత్యక్షప్రసారం చేస్తారు. వాహనసేవల్లో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కోలాటం, చెక్కభజన, పండరి భజన తదితర కళారూపాలను ప్రదర్శిస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.