RADHASAPTHAMI IN SRI GT ON FEBRUARY 12_ ఫిబ్రవరి 12న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రథసప్తమి
Tirupati, 09 Feb. 19: The important festival of Radhasapthami will be observed in Sri Govindaraja Swamy temple on February 12 on the auspicious occasion of Surya Jayanthi.
The Lord glides along mada streets encircling the shrine on seven different vehicles on a single day from morning till night.
The vahana sevas commences with Suryaprabha Vahanam in the morning and concludes with Garuda Vahana Seva in the night.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
ఫిబ్రవరి 12న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రథసప్తమి
తిరుపతి, 2019 ఫిబ్రవరి 09: ఫిబ్రవరి 12వ తేదీన సూర్యజయంతిని పురస్కరించుకొని రథసప్తమి పర్వదినాన తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా మంగళవారం తెల్లవారుజామున 3.00 గంటలకు శ్రీచక్రత్తాళ్వార్‌ను ఊరేగింపుగా శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలోని ఆళ్వారు తీర్థానికి వేంచేపు చేసి చక్రస్నానం నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో శ్రీ గోవిందరాజ స్వామివారి వాహన సేవలు ప్రారంభమవుతాయి.
వాహనసేవల వివరాలు
సమయం వాహనం
ఉ. 5.30 – ఉ. 7.00 సూర్యప్రభ వాహనం
ఉ. 7.30 – ఉ. 8.30 హంస వాహనం
ఉ. 9.00 – ఉ. 10.00 హనుమంత వాహనం
ఉ. 11.30 – మ. 12.30 పెద్దశేష వాహనం
మ. 1.00 – మ. 2.30 ముత్యపుపందిరి వాహనం
మ. 2.30 – మ. 3.30 సర్వభూపాల వాహనం
సా. 6.30 – రా. 8.00 గరుడ వాహనం
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.