ARRANGEMENTS FOR BHOOMI PUJA OF SRIVARI TEMPLE AT MUMBAI UNDER WAY _ ముంబైలో శ్రీవారి ఆలయ భూమి పూజకు విస్తృత ఏర్పాట్లు

TEMPLE COMING UP IN A SPRAWLING 10-ACRE AREA AT ULWE -TTD EO

TIRUMALA, 11 AUGUST 2022: The arrangements are underway for the Bhoomi Puja of Bhagavan Balaji ka Mandir (Sri Venkateswara Swamy temple) coming up at Ulwe in Navi Mumbai which is scheduled on August 21.

Talking to media persons at Annamaiah Bhavan in Tirumala on Thursday, the EO said, the Maharastra Government has allotted at 10acre prime land at Ulwe near Navi Mumbai by the side of Coastal Corridor, which is going to be a focal point in next couple of years.

“Already the temple-related rituals started as per the tenets of Vaikhanasa Agamam. On August 10, Vishwakaena Aradhana, Punyahavachanam, Kanya Pooja, Vrishabha Pooja, Bhookarshanam, Beejavapanam were performed under the supervision of Tirumala Pradhana Archaka Sri Venugopala Deekshitulu”, EO maintained.

The cost of the main temple is estimated to be Rs.100 cr while the remaining constructions are estimated to be another 100 cr. The Raymond Chief Sri Goutam Singhania has already come forward to maintain the cost of the entire temple construction “, the EO added.

JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CEO SVBC Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao, SE 2 Sri Jagadeeshwar Reddy, and other officials were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ముంబైలో శ్రీవారి ఆలయ భూమి పూజకు విస్తృత ఏర్పాట్లు

ఉల్వే వద్ద 10 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణం

-టీటీడీ ఈవో

తిరుమ‌ల‌, 2022 ఆగ‌స్టు 11: నవీ ముంబైలోని ఉల్వేలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ భూమి పూజ ఆగస్టు 21న నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు.

తిరుమల అన్నమయ్య భవన్‌లో గురువారం మీడియా ప్రతినిధులతో ఈవో మాట్లాడుతూ, కోస్టల్ కారిడార్ పక్కనే నవీ ముంబై సమీపంలోని ఉల్వే వద్ద మహారాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. ఈ స్థ‌లం రానున్న రెండేళ్లలో కేంద్ర బిందువుగా మారుతుందన్నారు.

ఆగస్టు 10న తిరుమల ప్రధాన అర్చక శ్రీ వేణుగోపాల దీక్షితులు ఆధ్వర్యంలో వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా ఆలయానికి సంబంధించిన క్రతువులు ప్రారంభించిన‌ట్లు చెప్పారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కన్యా పూజ, వృషభ పూజ, భూకర్షణ, బీజవాపనం నిర్వహించార‌ని తెలిపారు.

ప్రధాన ఆలయ వ్యయం రూ.100 కోట్లు కాగా, మిగిలిన నిర్మాణాలు మరో 100 కోట్లు అవుతాయని అంచనా వేసిన‌ట్లు తెలియ‌జేశారు. శ్రీ‌వారి ఆలయ నిర్మాణానికి అయ్యే మెత్తం వ్యయాన్ని రేమండ్ చీఫ్ శ్రీ గౌతమ్ సింఘానియా ఇవ్వ‌డానికి ముందుకు వచ్చిన‌ట్లు ఈవో వివ‌రించారు.

జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్‌ఈ 2 శ్రీ జగదీశ్వర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.