ARTHA BRAHMOTSAVAM OFF TO A COLOURFUL START WITH SURYAPRABHA_ సూర్యప్రభవాహనంపై శ్రీ మన్నారాయణుడు

FIRST RAYS OF SUN FALLS ON SURYANARAYANA AT 7:04AM

ADITYA HRIDAYAM BY BALAMANDIR STUDENTS SPECIAL ATTRACTION

Tirumala, 24 January 2018: The bright day on Wednesday commenced with first rays of Lord Surya touching the holy feet of Lord Surya Narayanamurty on the auspicious day of Radhasapthami.

Lord Malayappa Swamy as Lord Suryanarayana Murthy glided swiftly on the Seven Horse driven Surya Prabha Vahanam. The beauty of Lord enhanced in the bright rays of Sun as the vahanam is decked with bright red ixora. The first rays touched feet of Lord at 7:04am.

The four mada streets reverberated to the rhytmic chant of ” Govinda..Govinda” as soon as the first Harati after sacred rays touched the divine feet.

Aditya Hridayam rendered in chorus by the students of Balamandir remained as a special attraction during the festival.

TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju and other officers were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

సూర్యప్రభవాహనంపై శ్రీ మన్నారాయణుడు

తిరుమలలో వైభవంగా రథసప్తమి

సూర్య జయంతిని పురస్కరించుకొని బుధవారంనాడు తిరుమలలో ‘రథసప్తమి’

జనవరి 24, తిరుమల 2018: ఉత్సవాన్ని టిటిడి అంగరంగ వైభవంగా నిర్వహించింది. శ్రీవారి బ్రహ్మూెత్సవాలను తలపించే రీతిలో తిరుమల క్షేత్రం భక్తజన సందోహంతో కిటకిటలాడింది.

ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీమలయప్పస్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవ క్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ, భక్తులను అనుగ్రహించడం విశేషం. ఈ వాహనాల సేవలతోపాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారుకు మధ్యాహ్నం చక్రస్నానం నిర్వహించనున్నారు.

రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీ.శ 1564 నుండి జరుపుతున్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై ఊరేగే స్వామివారి కమనీయ రూపాన్ని దర్శించడానికి భక్తులు తండోపతండాలుగా విచ్చేశారు.

సూర్యప్రభ వాహనం : (ఉదయం 5.30 గం||ల నుండి ఉదయం 8.00 గం||ల వరకు) అత్యంత ప్రధానమైన రథసప్తమి వాహనసేవ సూర్యప్రభవాహనం. సర్వలోకాలకు చైతన్యాన్ని కలిగిస్తూ ఉదయించే శ్రీ సూర్య భగవానుడు తన ఉషారేఖలను ఉదయం 7.04 ని|| శ్రీవారి పాదాలపై ప్రసరించి అంజలి ఘటించాడు. ఈ వాహనసేవ అపురూప ద శ్యాన్ని తిలకించడానికి ఉదయాత్పూర్వం నుండి ఎంతో ఆసక్తితో నిరీక్షిస్తున్న వేలాది మంది కన్నులు ఒకసారి భక్తిపారవశ్యంతో పులకించాయి. భక్తుల గోవిందనామస్మరణల మధ్య స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది.

ఆకట్టుకున్న బాలమందిరం విద్యార్థుల ‘ఆదిత్యహృదయం’, ‘సూర్యాష్టకం’

రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యప్రభ వాహనసేవలో టిటిడి శ్రీవేంకటేశ్వర బాలమందిరం విద్యార్థులు ఆలపించిన ‘ఆదిత్యహ దయం’, ‘సూర్యాష్టకం’, ‘శ్రీ వెంకటేశ సప్తవాహన స్తోత్రమ్‌’ సంస్క త శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తర మాడ వీధిలోకి సూర్యప్రభ వాహనం వచ్చిన అనంతరం విద్యార్థులు లయబద్ధంగా శ్లోకాలు ఆలపించారు.

టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి శ్రీఎన్‌.ముక్తేశ్వరరావు పర్యవేక్షణలో బాలమందిరం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. గతంలో జరిగిన శ్రీవారి బ్రహ్మూెత్సవాలు, ఇతర ఉత్సవాల్లోనూ విద్యార్థులు శ్రీనివాసగద్యాం, వివిధ సంస్కృత శ్లోకాలు ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు.

చిన్నశేష వాహనం : (ఉదయం 9.00 గం||ల నుండి 10.00 గం||ల వరకు) సూర్యప్రభ వాహనంపై శ్రీసూర్యనారాయణమూర్తి కమనీయ రూపాన్ని తిలకించి పులకించిన భక్తులు అనంతరం స్వామివారి చిద్విలాసాన్ని చిన్నశేష వాహనంపై తిలకించి తరించారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్న శేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

గరుడ వాహనం : (ఉదయం 11.00 గం||ల వరకు 12.00 గం||ల వరకు) స్వామివారికి ఎన్ని వాహనసేవలు ఉన్నా తన ప్రియమైన గరుడ వాహనసేవ లేనిదే పరిపూర్ణత చేకూరదు. అలంకారప్రియుడైన స్వామివారు సర్వాలంకార భూషితుడై, పుష్పమాలాలంక తుడై ఛత్రచామర సార్వభౌమిక మర్యాదలతో, పక్షిరాజు గరుడునిపై రాజఠీవితో తిరువీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించాడు.

హనుమంత వాహనం : (మధ్యాహ్నం 1.00 గం|| నుండి మధ్యాహ్నం 2.00 గం||ల వరకు) భక్తులకు నిజమైన భక్తిరసం, శరణాగతి నిర్వచనాన్ని తెలియపరచడానికి స్వామివారు భక్తాగ్రేసరుడైన హనుమంతుని వాహనంపై పుణ్యక్షేత్ర మాడ వీధులలో ఊరేగి ఆశీర్వదించాడు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, సివిఎస్‌వో శ్రీ ఆకే.రవికృష్ణ, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కోదండరామరావు, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.