PILGRIMS POUR IN LAURELS ON TTD ARRAGEMENTS_ రథసప్తమికి టిటిడి ఏర్పాట్లపై భక్తుల సంతృప్తి – తిరు మాడ వీకుధులలో భక్తులకు అందిస్తున్న సేవలను పరిశీలించిన టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirumala, 24 January 2018: Tens of thousands of devotees who converged to witness the Sapta vahana sevas of Lord Malayappa on the occasion of Radhasaptami poured in laurels on the arrangements made by TTD for the big fete on Wednesday.

TTD EO Sri Anil Kumar Singhal with Tirumala JEO Sri KS Sreenivasa Raju inspected the galleries and interacted with the pilgrims. They expressed their happiness over the arrangements.

Tirunavakkarusu from Vellore and Pungodai from Salem said that water, buttermilk, beverages and Annaprasadam are promptly distributed. “I entered the gallery by 3am today. The TTD is serving different varieties of delicacies in regular intervals. The toilets were frequently cleaned by the concerned staff”, said Sri Tirunavakkarusu.

As per Sri.Bhaskar from Prakasam and Sri Prakash Rao from Visakhapatnam, the distribution of food and water have been planned in such a way this time that they reached even the fqrther and top most step in the gallery. The seva volunteers stood in the gangways and distributed the food and water satchets, Sri Rao observed.

SRIVARI SEVA SERVICES HAILED

Under the instructions of TTD EO Sri Anil Kumar Singhal, in the personal supervision of Tirumala JEO Sri KS Sreenivasa segregation of srivari seva volunteers as per the requirement of Annaprasadam, Health and Vigilance departments for distribution of food, water and queue line management.

About three lakhs buttermilk packets and six lakh water satchets were distributed in galleries. The sevakulu were placed in zig-zag position to distribute the buttermilk, water and food to all the devotees sitting in galleries.

Around 2300 sevakulu have been exclusively deployed for mada streets service.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

రథసప్తమికి టిటిడి ఏర్పాట్లపై భక్తుల సంతృప్తి – తిరు మాడ వీకుధులలో భక్తులకు అందిస్తున్న సేవలను పరిశీలించిన టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

జనవరి 24, తిరుమల 2018 : తిరుమలలో రథసప్తమి పర్వదినం సందర్భంగా ఆలయ నాలుగు మాడ వీధులలోని గ్యాలరీలలో శ్రీవారి వాహనసేవలు వీక్షించేందుకు వేచివున్న వేలాది మంది భక్తులకు టిటిడి చేసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా

ఉన్నయని భక్తులు తెలిపినట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలియజేశారు. తిరుమలలోని ఆలయ నాలుగు మాడ వీధులలో బుధవారం ఉదయం టిటిడి ఈవో, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుతో కలిసి భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఈవో గ్యాలరీలలోని భక్తులకు కాఫీ, పాలు, అల్పాహరం, అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ పంపిణీని పరిశీలించారు. భక్తులను ప్రత్యక్షంగా కలిసి వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. గ్యాలరీల వెనుక వైపు భక్తులు సేద తీరడానికి వేసిన చలువ పందిళ్లు ఉన్నాయని భక్తులు తెలిపారన్నారు. ఉత్తర మాడ వీధిలో వెనుక వైపు ఉన్న భక్తులకు కూడా తాగునీరు, అన్నప్రసాదాలు నిరంతరాయంగా అందించాలని సిబ్బందిని ఆదేశించారు. గ్యాలరీల వారిగా ప్రతి మాడ వీధిలో ఏర్పాటు చేసిన అధికారులు, సిబ్బంది, శ్రీవారిసేవకులు సమన్వయంతో పనిచేయాలన్నారు. భక్తులు కోరినంత అన్నప్రసాదాలు అందించాలని అధికారులను ఆదేశించారు. తూర్పు మాడ వీధిలో ఏర్పాటు చేసిన ఆధునిక అన్నప్రసాదాల పంపిణీ కేంద్రం భక్తులకు విశేషంగా ఉపయోగ పడుతుందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక మరియు ఉత్తర భారతదేశం నుండి విచ్చేసిన అనేక మంది భక్తులు ఈవోతో నేరుగా మాట్లాడుతూ తిరుమలలో తమకు అందుతున్న సౌకర్యాలు, స్వామివారి వాహనసేవలు చూడటానికి చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, క్యాటరింగ్‌ అధికారి శ్రీ జి.ఎల్‌.ఎన్‌.శాస్త్రీ, ఆరోగ్య విభాగం అధికారి డా|| శర్మిష్ట ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ అందేల చర్యలు తీసుకొంటున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.