ASTOTTARA SATA KALASABHISHEKAM PERFORMED IN SRI KRT_ శ్రీకోదండరామాలయంలో ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం

Tirupati, 6 September 2017: The special ritual Astottara Sata Kalasabhishekam was performed in Sri Kodanda Rama Swamy temple in Tirupati on Wednesday.

The special sacred bath was performed to the deities in Maha Mandapam with 108 holy kalasas to the processional deities.

Later in the evening pushkarini harati was given to the deities at Ramachandra Pushkarini.

Temple DyEO Sri Munilakshmi and others were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీకోదండరామాలయంలో ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం

తిరుపతి, 2017 సెప్టెంబరు 06: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో బుధవారం అష్టోత్తర శతకలశా భిషేకం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలోని మహామండపంలో ఉదయం 10.00 గంటలకు అమ్మవారు, స్వామివార్ల ఉత్సవమూర్తులకు 108 కలశాలతో అభిషేకం చేశారు.

ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఆస్థానం చేపడతారు. ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి బి.మునిలక్ష్మి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శేషారెడ్డి, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.