TTD TO OBSERVE VALMIKI JAYANTI ON OCTOBER 5_ అక్టోబర్‌ 5న ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి : తిరుపతి జెఈవో

Tirupati, 6 September 2017: The temple management of Tirumala Tirupati Devasthanams is set to observe Valmiki Maharshi Jayanti on October 5 across the two Telugu states in a big way.

A review meeting in this regard was conducted by Tirupati JEO Sri P Bhaskar in Vengamamba Hall at SVETA building on Wednesday with Dharma Prachara Mandali members.

Speaking on this occasion, the JEO said, the services of Srivari Sevakulu is extensively used in the respective areas to involve the people in huge numbers. “There will be Ramayana Pravachanam starting from day till night in majority places in twin Telugu states. The DPM members also take part in an active manner to motivate the public. Small books on the life of Sri Valmiki Maharshi should be distributed among the public. In a similar manner the Managudi programme which will be observed in the auspicious month of Karthika should also be observed in a big way in the two states”, he added.

Earlier the JEO launched the Hindu Dharma Prachara Parishad website and collected the feedback from DPM members.

HDPP Secretary Sri Ramakrishna Reddy, Kalyanotavam Project Special Officer Sri Prabhakar Rao were also present.


ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారిసేవకుల భాగస్వామ్యంతో విస్తృతంగా ధర్మ ప్రచారం

అక్టోబర్‌ 5న ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి : తిరుపతి జెఈవో

తిరుపతి, 2017 సెప్టెంబరు 06 : శ్రీవారిసేవకుల భాగస్వామ్యంతో ధర్మ ప్రచార కార్యక్రమాలను విస్కృతంగా ప్రచారం చేయాలని, అక్టోబర్‌ 5వ తేదీన వాల్మీకి మహర్షి జయంతిని రెండు తెలుగు రాష్ట్రాలలోని అన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించాలని జిల్లా ధర్మ ప్రచార మండలి సభ్యులను కోరారు. తిరుపతిలోని శ్వేత భవనంలో గల వెంగమాంబ సమావేశ మందిరంలో బుధవారం టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ నూతనంగా ప్రారంభించిన వెబ్‌సైట్‌పై జిల్లా ధర్మ ప్రచార మండలి సభ్యుల అభిప్రాయ సేకరణ జరిగింది.

ఈ సందర్బంగా జెఈవో మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేయాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ హిందూ ధర్మ ప్రచారానికి, పరిరక్షణకు కృషి చేయాన్నారు. జిల్లా ధార్మిక మండళ్లు క్షేత్ర స్థాయిలో సమన్వయం చేసుకోని టిటిడి కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

అక్టోబర్‌ 5వ తేదీ వాల్మీకి మహర్షి జయంతిని ఉదయం నుండి సాయంత్రం వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ ప్రాంతాలలో రామాయణం ప్రవచనాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన జీవిత చరిత్రను తెలిపే పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయాలని డిపిపి అధికారులను ఆదేశించారు. కార్తీక మాసంలో మనగుడి కార్యక్రమాన్ని ఎక్కువ ఆలయాలలో నిర్వహించాలని ధర్మ ప్రచార మండలి సభ్యులను కోరారు.

ఈ సమావేశంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి శ్రీ రామకృష్ణారెడ్డి, కల్యాణోత్సవం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ప్రభాకరరావు, జిల్లా ధర్మ ప్రచార మండలి సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది