ASTOTTARA SATAKALASABHISHEKAM ON AUGUST 1 _ ఆగస్టు 1న శ్రీ కోదండరామాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం
Tirupati, 28 July 2023: Astottara Sata Kalasabhishekam will be observed in Sri Kodandarama Swamy temple on August 1 on the occasion of Pournami.
Later in the evening, there will be a procession of Utsava Murties along the mada streets followed by Pushkarini Harati.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు 1న శ్రీ కోదండరామాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం
తిరుపతి, 28 జూలై 2023: తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 1వ తేదీ పౌర్ణమి సందర్భంగా అష్టోత్తర శతకలశాభిషేకం వైభవంగా జరుగనుంది. ఆలయంలో ఉదయం 9 గంటలకు ఈ సేవ నిర్వహిస్తారు.
అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఆస్థానం చేపడతారు. ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహిస్తారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.