ASTOTTARA SATAKUNDATMAKA MAHA SHANTI YAGAM CONCLUDES _ శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలోఘనంగా ముగిసిన అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగం

Srinivasa Mangapuram, 18 Oct. 19: The Agamic ritual of Astottara Satakundatmaka Maha Shanti Yagam concluded on a grand religious note in Sri Kalyana Venkateswara Swamy temple in Srinivasa Mangapuram on Friday.

In 2010, TTD has convened this yagam to spread the glory of Sri Kalyana Venkateswara Swamy and also seeking good rains and bestow the state and country with prosperity. The three day fete which commenced on October 16 with Ankurarpanam concluded on Friday with Maha Purnahuti.

TTD EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy, DyEO Sri Ellappa and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలోఘనంగా ముగిసిన అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగం

తిరుపతి, 2019 అక్టోబరు 18: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో  గత రెండు రోజులుగా జరుగుతున్న అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగం శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ సందర్బంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 9.00 గంలకు ప్రధాన కంకణబట్టార్‌ శ్రీసీతారామాచార్యులు  ఆధ్వర్యంలో కుంభరాధన, గజపూజ, ఉక్త హోమాలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 12.00 గంటలకు పూర్ణాహుతితో మహాయాగం ముగిసింది. తరువాత అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో కుంభంలోని స్వామివారి శక్తిని మూలవిరాట్టులోనికి ఆవహణం చేశారు. ఈ మహాయాగంలో వివిద రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వేద పండితులు,  వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.  

స్వామివారి వైభవాన్ని నలు దిశల వ్యాప్తి చేయడానికి శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 2010లో టిటిడి ఈ యాగం నిర్వహించగా, తిరిగి ఈ ఏడాది 2019 అక్టోబరు 16 నుండి 18వ తేదీ వరకు శాస్త్రోక్తంగా నిర్వహించింది. ఈ యాగం ద్వారా దేశంలో, రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో వర్షలు కురిసి, సంవృద్ధిగా పంటలు పండి సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యాగం ఉద్దేశం.  

అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహా యాగంలో భాగంగా ఆలయంలో 7 ప్రధాన హోమగుండాలతో పాటు, 108 హోమగుండాలు ఏర్పాటు చేసి, వివిద రాష్ట్రాలకు చెందిన 150 మంది ప్రముఖ రుత్వికులచే హోమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో శ్రీఎ.వి.ధర్మారెడ్డి, వైఖానస ఆగమ సలహదారులు శ్రీ సుందరవరద బట్టచార్యులు, శ్రీమోహన రంగాచార్యులు, శ్రీ అనంతశయన దీక్షితులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ యలప్ప, ఏఈవో శ్రీ  ధనంజయులు, ఆలయ ప్రధానార్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ అనిల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.