ASTOTTHARA SHATAKALAASABHISHEKAM HELD IN SRI KODANDARAMALAYAM _ శ్రీ కోదండరామాలయంలో ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం

Tirupati, 25 March 2025: Astottara Shatakalasabhishekam was held in splendour on the occasion of Pournami in Sri Kodandarama Swamy temple at Tirupati on Monday. 

As part of this, sacred waters in 108 Kalasas were rendered to the Utsavamurtis in the Kalyana Mandapam of the temple from 9 am to 10.30 am.

On this occasion, at 5.30pm, a procession of the idols of Sri Kodandarama Swami along with Sri Sita Lakshmana will be held in the four Mada streets of the temple. 

From there Sri Ramachandra will be taken to Pushkarini and Unjal Seva will be performed.  After that pushkarini Harati was performed.

Temple Deputy EO Smt. Nagaratna, Superintendent Sri. Somasekhar, Temple Inspectors Sri Chalapathy, Sri Suresh and a large number of devotees participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీ కోదండరామాలయంలో ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం

తిరుపతి, 2024 మార్చి 25: తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో పౌర్ణ‌మి సంద‌ర్భంగా సోమవారం అష్టోత్తర శతకలశాభిషేకం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలోని కల్యాణమండపంలో ఉదయం 9 నుండి 10.30 గంటలకు అమ్మవారు, స్వామివార్ల ఉత్సవమూర్తులకు 108 కలశాలతో అభిషేకం చేశారు.

ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజ‌ల్ సేవ‌ చేపడతారు. ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి నాగ‌ర‌త్న‌, సూపరింటెండెంట్‌ శ్రీ సోమ‌శేఖ‌ర్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ చ‌ల‌ప‌తి, శ్రీ సురేష్‌, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.