PANGUNOTTARAM FEST _ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ముగిసిన పంగుణోత్తర ఉత్సవం

POURNAMI GARUDA SEVA HELD

Tirupati, 25 March 2024: The Pangunottaram festival for Sri Pundarikavalli Tayar in Sri Govindaraja Swamy temple was observed in Tirupati on Monday.

In the evening Garuda Seva was also observed on the auspicious occasion of Phalguna Pournami.

DyEO Smt Shanti and others, devotees participated.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ముగిసిన పంగుణోత్తర ఉత్సవం

– వైభవంగా పౌర్ణమి గరుడసేవ

తిరుప‌తి, 2024 మార్చి 25: తిరుపతి శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో గల శ్రీ పుండరీకవళ్లి (సాలైనాంచియార్‌) అమ్మవారి పంగుణి ఉత్తర ఉత్సవం సోమ‌వారం ఘనంగా ముగిసింది.

ఈ సందర్భంగా ఉదయం అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి విశ్వరూప సర్వదర్శనం కల్పించారు. త‌రువాత‌ శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి సన్నిధిలో వేడుకగా స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చంద‌నంలతో స్నపనం నిర్వహించారు. అనంతరం ఆస్థానం నిర్వహించారు.

సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ పుండరీకవళ్లి అమ్మవారిని ఆలయ విమానప్రాకారం చుట్టూ ఊరేగించారు. ఆ త‌రువాత‌ ఊంజల్‌సేవ నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ నారాయ‌ణ‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ రాధాకృష్ణ, త‌దిత‌రులు పాల్గొన్నారు.‌

వైభ‌వంగా శ్రీ గోవిందరాజస్వామివారి పౌర్ణమి గరుడసేవ

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సోమ‌వారం పౌర్ణమి గరుడసేవ వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్నారు.

ప్రతి పౌర్ణమినాడు ఆలయంలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా సోమ‌వారం రాత్రి 9.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు తన ప్రియభక్తుడైన గరుడునిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.