AUCTION OF UNUSED CLOTHES OF TTD FROM DEC 11 TO 19_ డిసెంబరు 11 నుంచి 19వ తేదీ వరకు వినియోగంలో లేని వస్త్రాల ఈ-వేలం

Tirupati, 9 December 2017: Numerous unused donor cloths segregated in 441 slots will be e-auctioned from Dec 11-19 by the TTD marketing department through the MSTC e-platform.

The clothing’s include Towels silk Uttariams, lungis, cloth bits, ready made apparel, Khanduvas, Bed sheets, Shawls, pillow covers, kerchiefs, Punjabi dress materials, cloth used in sanctums, curtains of Bangaru vakili, khaki curtains, white cloth covers of Hundis, pavitrams, blouse pieces, umbrellas and saris etc.

For other details Pl contact office of the General Manager (auctions) at 0877-2264429 or www.mstcecommerce.com/ www.mstcindia.co.in / www.tirumala.org

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

డిసెంబరు 11 నుంచి 19వ తేదీ వరకు వినియోగంలో లేని వస్త్రాల ఈ-వేలం

డిసెంబరు 09, తిరుపతి, 2017: టిటిడిలో వినియోగంలో లేని పలు రకాల వస్త్రాల ఈ-వేలం డిసెంబరు 11 నుంచి 19వ తేదీ వరకు జరుగనుంది. టిటిడి మార్కెటింగ్‌ విభాగంలో 441 లాట్లకు గాను విశాఖపట్నంలోని ఎంఎస్‌టిసి లిమిటెడ్‌ ఈ-ప్లాట్‌ఫాంపై ఈ-వేలం నిర్వహిస్తారు.

ఇందులో పట్టు, కాటన్‌ ఉత్తరీయాలు, టర్కీ టవళ్లు, లుంగీలు, క్లాత్‌ బిట్‌లు, రెడేమేడ్‌ వస్త్రాలు, శాలువలు, బెడ్‌షీట్లు, పిల్లో కవర్లు, కర్చీఫ్‌లు, పంజాబి డ్రెస్‌ మెటీరియల్‌, గర్భగృహ కురాళాలు ఉన్నాయి. వీటితోపాటు బంగారు వాకిలి పరదాలు, కాకి పరదాలు, హుండీ గల్లేబులు, పవిత్రాలు, బ్లౌజ్‌ పీస్‌లు, గొడుగులు, చీరలు తదితర వస్త్రాలు ఉన్నాయి.

ఇతర వివరాల కోసం మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2264429 ఫోన్‌ నంబరులో గానీ, www.mstcecommerce.com/ www.mstcindia.co.in / www.tirumala.org వెబ్‌సైట్లను గానీ సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.