BALALAYAM AT SRI GT FROM DEC 11 TO DEC 15_ డిసెంబరు 11 నుంచి 15వ తేదీ వరకు శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ”బాలాలయం”

Tirupati, 9 December 2017: Balalayam, a ritual for rejuvenation of the sanctum of any temple, will be performed at Sri Govindaraja Swamy Temple from Dec 11 to 15. The traditional rites will be conducted at the sanctum of temples of Sri Govindaraja Swamy, Anjaneyaswami, Tirumala Nambi, Bhashyakarlu, Koorthalwar, Madhurakavi Alwar, Modaliayandan ahead of modernisation of the interiors.

The ankurarpanam for these works and rites will be made at 7.30pm on Dec 10. The daily rituals in the temple during the duration of the Balalayam will be performed in a model temple and sanctums built in the complex. Special rituals will be performed in the Yagashala commensurate with the Balalayam from Dec 11-14 and Mahasamprokshanam will be performed on Dec 15 morning and in the evening Sri Govindaraja Swamy will ride Peddasesha Vahanam on the mada streets.

Temple DyEO Smt P Varalakshmi will supervise all the programs and rites during the Balalayam event.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

డిసెంబరు 11 నుంచి 15వ తేదీ వరకు శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో ”బాలాలయం”

డిసెంబరు 09, తిరుపతి, 2017: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో డిసెంబరు 11 నుంచి 15వ తేదీ వరకు ”బాలాలయం” కార్యక్రమం శాస్త్రోక్తంగా జరుగనుంది. శ్రీగోవిందరాజస్వామివారి సన్నిధి, ఎదురు ఆంజనేయస్వామివారి ఆలయం, తిరుమలనంబి, భాష్యకార్లు, కూరత్తాళ్వార్‌, మధురకవి ఆళ్వార్‌, మొదలియాండన్‌ సన్నిధుల్లో గర్భాలయ జీర్ణోద్ధరణ(ఆధునీకరణ పనులు) కార్యక్రమాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి డిసెంబరు 10వ తేదీ ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు.

సాధారణంగా గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం ”బాలాలయం” చేపడతారు. ఇందుకోసం ఆలయంలోని కల్యాణమండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల తరహాలో చెక్కతో విగ్రహాలను ఏర్పాటుచేశారు. ఈ 5 రోజుల పాటు స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు. ఆలయంలోని యాగశాలలో డిసెంబరు 11 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. డిసెంబరు 15వ తేదీ ఉదయం 10 నుంచి 10.30 గంటల మధ్య మకర లగ్నంలో మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. ఉత్తర నక్షత్రం సందర్భంగా డిసెంబరు 15న సాయంత్రం 5.30 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీగోవిందరాజ స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి పి.వరలక్ష్మి ఈ కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.