ANNAMACHARYA CD RELEASED_ ”అన్నమయ్య కమలాసన సౌభాగ్యం” సంకీర్తనల ఆవిష్కరణ
Tirupati, 10 April 2018: Following auspicious Sravana Nakshatram on Tuesday, Annamacharya CD was released SV Recording Project of TTD.
Annamaiah Kamalasana Soubhagyam CD with sankeertanas rendered by Sri G Madhusudhan Rao, Smt Niya santhoshini and Smt Srinidhi was released by Spl Gr DyEO Sri Munirathnam Reddy at Annamacharya Kalamandiram in Tirupati.
Vengamamba Project co-ordination Dr KJ Krishnamurthi was also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
”అన్నమయ్య కమలాసన సౌభాగ్యం” సంకీర్తనల ఆవిష్కరణ
తిరుపతి, 2018 ఏప్రిల్ 10: శ్రీవారు జన్మించిన శ్రవణానక్షత్రాన్ని పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ”అన్నమయ్య కమలాసన సౌభాగ్యం” సంకీర్తనలను ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి మాట్లాడుతూ ఈ సంకీర్తనలను టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. అన్నమయ్య సంకీర్తనలను భక్తులు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు.
టిటిడి ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ సంకీర్తనలను రికార్డు చేశారు. ఇందులోని సంకీర్తనలను ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ జి.మధుసూదన్‌రావు, శ్రీమతి నిత్య సంతోషిని, శ్రీమతి శ్రీనిధి స్వరపరిచి గానం చేశారు. ఈ సందర్భంగా గాయని గామకులను శాలువతో సన్మానించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం వారు ఈ సంకీర్తనలను పాడి వినిపించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.