ELECTRIC BUS ON TRIAL RUN FOR A WEEK IN TIRUMALA_ తిరుమలలో బ్యాటరీ బస్సు ప్రయోగాత్మంగా ప్రారంభం

Tirumala, 10 April, 2018: The Electric bus by Hyderabad based Gold Stone company will be operated for a week on trial basis in Tirumala starting from Tuesday, said GM Transport Sri PV Sesha Reddy.

This 32 seater bus will be operated in the TTD dharmaratham free bus route in Tirumala. After assessing its feasibility for a week, further decision will be taken by higher authorities over its utility”, said GM Transport.

Tirumala DI Sri Bhaskar Naidu was also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

తిరుమలలో బ్యాటరీ బస్సు ప్రయోగాత్మంగా ప్రారంభం

ఏప్రిల్‌ 10, తిరుమల 2018: తిరుమలలో మంగళవారం సాయంత్రం బ్యాటరీ బస్సును టిటిడి ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. టిటిడి రవాణా విభాగం కార్యాలయంలో జనరల్‌ మేనేజర్‌ శ్రీ శేషారెడ్డి జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ముందుగా బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ శేషారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుమలను కాలుష్యరహితంగా తీర్చిదిద్దడంలో భాగంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఆదేశాల మేరకు బ్యాటరీ బస్సు పనితీరును పరిశీలిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన గోల్డ్‌స్టోన్‌ సంస్థ ఈ బస్సును రూపొందించిందన్నారు. తిరుమలలో ఉచిత బస్సుల తరహాలో వారం రోజుల పాటు ఈ బస్సును నడుపుతామని, పనితీరును పరిశీలించి ఉన్నతాధికారులు తగిన నిర్ణయం తీసుకుంటారని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌టిసి డిపో మేనేజర్‌ శ్రీ కెఎల్‌ఎన్‌.రెడ్డి, టిటిడి డిఐ శ్రీ భాస్కర్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.