BRING MORE TRANSPARENCY IN TTD WITH EXTENSIVE INTERNAL AUDIT ; TTD EO SRI ANIL SINGHAL_అంతర్గత ఆడిట్‌ ద్వారా టిటిడిలో మరింత పారదర్శకత : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Tirupati, 14 December 2017: TTD Executive Officer Sri Anil Kumar Singhal has said that internal audit has enhanced transparency in the functioning of TTD.Addressing the senior auditors at the TTD administrative Building, he urged them to streamline the activities of various programs like HDPP, Annamacharya Project, Dasa Sahitya,Project to suit the needs of devotees after a survey on their feed back.

He also said that officials should recover electricity dues from shops owners of Tirumala and directed for an audit on generation,demand and supply of power at Tirumala.

He wanted the reception officials to complete the repairs in the cottages and Rest houses at Tirumala and provide more accomodation to devotees on a war footing.The contractors who do not complete the engineering works should also be levied penalties compulsorily.

Among others TIrumala JEO Sri KS Sreenivasa Raju, Tirupati JEO Sri Pola Bhaskar, Chief Auditors Sri Narasimhamurthy, Sri Sharat, FACAO Sri O Balaji, Chief Engineer Sri Chandrasekhar Reddy, CAO Sri RaviPrasadu and other officials participated in the review meeting.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అంతర్గత ఆడిట్‌ ద్వారా టిటిడిలో మరింత పారదర్శకత : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

తిరుపతి, 14 డిసెంబరు 2017; టిటిడిలో క్రమం తప్పకుండా అంతర్గత ఆడిట్‌ నిర్వహించడం ద్వారా మరింత పారదర్శకత పెరుగుతుందని, పాలన మరింత మెరుగుపడుతుందని ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ పేర్కొన్నారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో ప్రముఖ ఆడిటర్లతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడిలోని హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు తదితర ప్రాజెక్టుల ద్వారా వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల సరళి, నాణ్యత, భక్తుల స్పందన తదితర అంశాలపై సర్వే నిర్వహించి అందుకు అనుగుణంగా కార్యక్రమాల్లో మార్పులు చేపట్టాలని సూచించారు. తిరుమలలోని పలు ప్రాంతాల్లో గల దుకాణాల్లో విద్యుత్‌ చార్జీలు చెల్లించనివారి నుంచి వసూలు చేయాలన్నారు. టిటిడిలో మొత్తం విద్యుత్‌ ఉత్పత్తి, వినియోగం, కొనుగోలుపై ఆడిట్‌ జరగాలన్నారు. తిరుమలలోని కాటేజీల్లో గదుల మరమ్మతులను త్వరగా పూర్తి చేసి వీలైనన్ని ఎక్కువ గదులను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని రిసెప్షన్‌ అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్‌ పనులను సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టర్లపై నిబంధనలకు అనుగుణంగా అపరాధం విధించాలన్నారు.

ఈ సమావేశంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, ప్రముఖ ఆడిటర్లు శ్రీ నరసింహమూర్తి, శ్రీ శరత్‌, ఎఫ్‌ఏ,సిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, సిఏవో శ్రీ రవిప్రసాదు, ఇతర టిటిడి అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.