VASANTHOTSAVAMS CONCLUDES _ శ్రీ‌నివాస‌మంగాపురంలో ముగిసిన వ‌సంతోత్స‌వాలు

Srinivasa Mangapuram, 13 May 20: The annual three day Vasanthotsavams concluded in Srinivasa Mangapuram temple on Wednesday. 

The deities of Sri Kalyana Venkateswara Swamy flanked by Sridevi and Bhudevi were given celestial Snapana Tirumanjanam. 

DyEO Sri Ellappa and other temple staff took part in this fete performed in Ekantam due to ongoing Corona COVID 19 lockdown restrictions. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

శ్రీ‌నివాస‌మంగాపురంలో ముగిసిన వ‌సంతోత్స‌వాలు

తిరుపతి, 2020 మే 13: శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు బుధ‌వారం ముగిశాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఉత్స‌వాల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వహించారు.

వసంతోత్సవాల్లో భాగంగా మ‌ధ్యాహ్నం 2.00 నుండి 4.00 గంటల వరకు ఆల‌య ముఖ‌‌ మండపంలో శ్రీ భూ స‌మేత క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు, శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయస్వామి వారికి, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. 

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ఎల్లప్ప, ఏఈవో ధ‌నంజ‌యుడు, సూపరింటెండెంట్‌ శ్రీ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.